Begin typing your search above and press return to search.

ఆ సెటైర్ పాటతో పవన్ గాలితీసిన పోసాని

By:  Tupaki Desk   |   4 March 2020 4:45 PM IST
ఆ సెటైర్ పాటతో పవన్ గాలితీసిన పోసాని
X
పోసాని కృష్ణ మురళి.. విలక్షణ నటుడు, రచయిత. సినిమాల్లో - బయటా ఒకేరకంగా ఉంటారాయన ఆయన చూపించే మేనరిజం ముక్కుసూటిగా - పంచులు వేసేట్టే ఉంటుంది. సినిమాలైనా - రాజకీయాలపై తప్పును తప్పు అని చెప్పడానికి భయపడని ఏకైక వ్యక్తత్వం పోసాని సొంతం.

తాజాగా పోసాని ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన కామెంట్ చేసింది వేరో ఎవరిమీదో కాదు.. సీఎం జగన్ పై ఒంటికాలి మీదే లేచే హీరో - జనసేనాని మన పవన్ కళ్యాణ్ పై.. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై పోసాని ఏమన్నాడంటే... ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ అంటూ పాట అందుకున్నారు.

పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పడు ఏం మాట్లాడకుండా ఇలా సెటైరికల్ గా పోసాని పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోసారి పవన్ గురించి అభిప్రాయం చెప్పమని యాంకర్ ప్రశ్నించినా కూడా పవన్ పై కామెంట్ చేయడానికి ఏముంది అంటూ లైట్ గా తీసేశారు.

బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్టీని ఏం చేశాడో పవన్ గురించి తెలుసనని.. అందరికీ తెలిసిన విషయాన్ని నేనేం చెప్పాలని.. ఇంకా నాకేం తెలియదు అంటూ పవన్ పై కామెంట్స్ చేయడానికి పోసాని వెనుకంజ వేశారు.

ఇలా పవన్ పై కామెంట్ చేయడానికి పోసాని నో చెప్పడం... సరదగా ఓ పాట పాడి సెటైర్లు వేయడంతో ఇప్పుడా పాటతో మీమ్స్, సెటైర్లు వేస్తూ నెటిజన్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ను బాగానే ఆడేసుకుంటున్నారు.