Begin typing your search above and press return to search.

రోజా టీవీ షో పై పోసాని కామెంట్స్‌

By:  Tupaki Desk   |   5 Jun 2020 3:40 PM IST
రోజా టీవీ షో పై పోసాని కామెంట్స్‌
X

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితం అయిన బతుకు జడ్కా బండి కార్యక్రమం గురించి ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ షోకు రోజా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. కొన్నాళ్ల క్రితం ఏడాది పాటు పోసాని ఈ కార్యక్రమంను చేశాడు. ఈ షో ద్వారా న్యాయం కోసం వచ్చిన వారిని కావాలని డ్రామా చేయించి ఏడిపించడం, వారితో నవ్వించడం కొట్టుకునేలా చేయడం చేస్తారంటూ విమర్శలు ఉన్నాయి.

తాజాగా పోసాని ఆ షో గురించి మాట్లాడుతూ తాను ఆ షో చేస్తున్నంత కాలం ఎలాంటి డ్రామాకు తావు ఇవ్వకూడదని భావించాను. అగ్రిమెంట్‌ సమయంలోనే నేను ఆ విధంగా ఒప్పందం చేసుకున్నాను. నేను ఎవరిని కొట్టడం కాని, ఎవరి పక్షాన ఉండటం కాని చేయను అంటూ చెప్పాను. కొన్ని సార్లు నన్ను మానిటర్‌ చేసేందుకు ప్రయత్నించే వారు. కాని నేను మాత్రం డ్రామాలకు అస్సలు ఒప్పుకునే వాడిని కాదు అంటూ ప్రస్తుతం అంతా డ్రామాగా ఆ షో సాగుతుందని చెప్పకనే చెప్పాడు.

ఆ షోను ఏడాది చేసిన తర్వాత పద్దతి నచ్చక పోవడంతో మానేశాను. మరో ఏడాది పాటు కాంట్రాక్ట్‌ కొనసాగించాలని విజ్ఞప్తి చేసినా కూడా నో అన్నాను. అమ్మాయికి సపోర్ట్‌గా నిలవాలని కొన్ని సార్లు, వారి తరపున మాట్లాడి అవతలి వారిని తిట్టాలని కొన్ని సార్లు నాకు కార్యక్రమ నిర్వాహకులు చెప్పేవారు. కాని నేను మాత్రం న్యాయం ఎటు ఉంటే అటు మాత్రమే మాట్లాడేవాడిని.

నా పద్దతితో వారు కొన్ని సార్లు ఇబ్బంది పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయంటూ పోసాని పేర్కొన్నాడు. మళ్లీ అలాంటి షో చేయాలనే ఆసక్తి లేదన్నాడు. ఇక తాను ఛారిటీ సంస్థలు ఏమీ పెట్టకుండా తనకు తోచినంత మేరకు సాయం చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.