Begin typing your search above and press return to search.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ : పోసాని
By: Tupaki Desk | 24 May 2020 9:26 AM ISTప్రముఖ నటుడు, రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి తన భావాలను మొహమాటం లేకుండా చెప్పేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తనకి నచ్చని విషయాల గురించి నిక్కచ్చిగా చెప్పేస్తూ ఉంటాడు. కాగా పోసాని వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైస్సార్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. నిన్నటికి వైస్సార్సీపీ గవర్నమెంట్ ఏర్పడి ఏడాది అయింది. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'వన్ మ్యాన్ ఆర్మీ' అని.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దాదాపు అన్ని హామీలను అమలు చేశారని సినీనటుడు పోసాని కొనియాడారు.
అంతేకాకుండా ప్రస్తుతం దేశం మొత్తం సంక్షోభంలో ఉన్న ఇలాంటి సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లా ఏ రాష్ట్రం కూడా ఇలా చేయలేదన్నారు. విశాఖ గ్యాస్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇచ్చారని.. దేశంలో కోటి రూపాయల పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల మృతులకు ఇచ్చింది రూ.10 లక్షలేనని.. విశాఖ గ్యాస్ ఘటనకు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని తెలియజేసారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ చాలా బాగున్నాయన్నారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్లను ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. అంతేకాకుండా చంద్రబాబు - సోనియా - అహ్మద్ పటేల్ - చిదంబరం లాంటి వారు కలిసి కుట్రలు చేసి జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టించారని పోసాని మురళీకృష్ణ విమర్శించారు.