Begin typing your search above and press return to search.

నిర్మాతలపై పోసాని స్టైల్ పంచ్ లు!

By:  Tupaki Desk   |   11 April 2015 11:16 AM IST
నిర్మాతలపై పోసాని స్టైల్ పంచ్ లు!
X
రచయిత, దర్శకుడు, తాజాగా విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళీ టాలీవుడ్ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షరూపాయలు జేబులో ఉన్న ప్రతీ ఒక్కడూ నిర్మాత అయిపోవాలని భావిస్తున్నారంటూ... వారి వల్ల ఆర్టిస్టులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియచెప్పే ప్రయత్నం చేశారు పోసాని. అందుకు " దోచేయ్ " ఆడియో కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు!
ప్రస్తుతం లక్ష రూపాయలు జేబులో పెట్టుకుని కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ
సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య టాలీవుడ్ లో రోజురోజుకు పెరిగి పోతోందని... అందువల్ల నిర్మాతలకు గౌరవం లేకుండా పోతుందని పోసాని వ్యాఖ్యనించారు. ఇటువంటి నిర్మాతల వల్ల సినిమాలలో నటిస్తున్న నటీనటులకు తమకు రావలసిన పారితోషికాలు వస్తాయా? రావా? అనే టెన్షన్ లో బతకాల్సి వస్తోందని సంచలనవ్యాఖ్యలు చేసారు!
అయితే తాను చెప్పాలనుకున్న విషయం ముక్కు సూటిగా తెగేసి చెప్పే పోసాని వ్యాఖ్యలు... ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా
సరిపోతాయని అదే కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నిర్మాతలు, సెలబ్రెటీలూ చేసిన కామెంట్స్ వినిపించాయి! అయితే పరిస్థితి పోసాని వ్యక్తిగతంగా ఎదుర్కోవడం వల్లే ఇలా మాట్లాడి ఉంటారని, సాక్ష్యం లేకుండా పోసాని గాలి మాటలు మాట్లాడరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.