Begin typing your search above and press return to search.

ఎవ‌రిమీద సెటైర్ నానా శాస్ర్తి?

By:  Tupaki Desk   |   3 Dec 2015 9:57 AM IST
ఎవ‌రిమీద సెటైర్ నానా శాస్ర్తి?
X
పోసాని కృష్ణ‌ముర‌ళి .. ఈ పేరే ఓ సంచ‌ల‌నం. ప‌రిశ్ర‌మ జ‌నాల‌తో పాటు ప్ర‌జ‌లంతా మెంట‌ల్ కృష్ణ అని ముద్దుగా పిలుచుకుంటారు. అత‌డి వేషాల‌న్న మెంట‌ల్‌ ని త‌ల‌పిస్తాయి కాబ‌ట్టి అలా పిలుస్తారంతే. వాస్త‌వానికి అస‌లు ఆ మెంట‌ల్ వెన‌క అస‌లు క‌థే వేరు. ఈ స‌మాజాన్ని ముక్కుసూటిగా తిట్టి పోయ‌డం అత‌డి వృత్తి. పొట్ట కూటి కోసం దౌర్భాగ్య‌మైన జీవితాన్ని అనుభ‌వించాల్సిన దుస్థితిలో ప్ర‌జ‌లంతా ఉన్నారు. దుర్మార్గ‌పు ప్ర‌పంచంలో మ‌నిషికి విలువ‌న్న‌దే లేదు. ప‌నికి స‌రిప‌డే వేత‌నం లేనేలేదు. కొంద‌రైతే ఇవ్వ‌కుండా ఎగ్గొట్టేస్తారు. ఇలాంటివ‌న్నీ పోసాని ర‌చ‌యిత‌గా ఉన్న‌ప్పుడు అనుభ‌వించి ఫ‌ల‌వ‌రించారు. అందుకే ఆ ఫ్ర‌స్ర్టేష‌న్‌ని క్యారెక్ట‌ర్ల‌లోకి తీసుకొచ్చి అక్క‌డ జీవించేస్తుంటారంతే. అలా మెంట‌ల్ కృష్ణ అయ్యాడంతే.

ఏదైతేనేం అత‌డు న‌టించే ప్ర‌తి క్యారెక్ట‌ర్ సంఘంపై ఓ సెటైర్ లాంటిదే. ఇటీవ‌లే ఎన్టీఆర్ హీరోగా న‌టించిన టెంప‌ర్ మూవీలో పోలీసోడి క్యారెక్ట‌ర్‌ లో న‌టించాడు. పోలీస్ ఉద్యోగాలంటే మ‌న‌సు చంపుకుని బ‌త‌క‌డ‌మే అన్న విష‌యాన్ని త‌న క్యారెక్ట‌ర్‌ లో చూపించాడు. మంచికి-చెడుకి మ‌ధ్య ఉన్న పోరాటాన్ని చూపించారు ఆ పాత్ర‌లో.

లేటెస్టుగా ర‌వితేజ‌- సంప‌త్‌ నంది కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కి ఈ నెల 10న రిలీజ‌వుతున్న బెంగాల్ టైగ‌ర్ మూవీలో పోసాని ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్‌ లో న‌టించాడు. సెల‌బ్రిటీ శాస్ర్తి అనేది క్యారెక్ట‌ర్ నేమ్. తెల్ల‌ని చొక్కా - పంచె క‌ట్టు - వైట్ అండ్ వైట్ మీద ఓంకార నామాలు - పిల్ల‌న‌గ్రోవి ప‌ట్టిన కృష్ణుడి బొమ్మ‌ల‌తో ఓ ప‌సుపు రంగు కోటు ధ‌రించి ఊరిమీద‌కి బ‌య‌ల్దేరే క్యారెక్ట‌ర్ ఇది. నుదిటిమీద నిలువెత్తు తిల‌కం దిద్ది ఎదుటివారికి సోప్ వేసేవాడిలాగా క‌నిపిస్తున్నాడు పోసాని. సెల‌బ్రిటీలంద‌రికీ మోక్షం కావాలి. కాబ‌ట్టి అదేదో నేనే ఇస్తా అన్న‌ట్టే క‌నిపిస్తోంది వాల‌కం. మ‌రి ఈ క్యారెక్ట‌ర్ ఎవరి మీద సెటైర్‌? అన్న‌ది తేలాల్సి ఉందింకా.