Begin typing your search above and press return to search.
బూతులు సరే కానీ ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు పోసాని?
By: Tupaki Desk | 30 Sept 2021 4:00 PM ISTమేం న్యాయ నిర్ణేతలం కాదు. ఆ విషయాన్ని మొదటే చెప్పేస్తున్నాం. కాకుంటే.. నాణెనికి బొమ్మ ఉన్నట్లే.. బొరుసు ఉంటుంది. ఒక వాదనతో పాటు రెండో వాదనను కూడా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. అన్ని వాదనలు విన్న తర్వాత ఎవరి విచక్షణతో వారు ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. పవన్ వర్సస్ వైసీపీ నేతల మధ్య లడాయి తెలుసు. ఇంతవరకు బాగానే ఉంది. మధ్యలో పోసాని వచ్చారు.
వచ్చినంతనే అమ్మతో మొదలు పెట్టి.. ఇంట్లో ఉండే పవన్ పెళ్లాం వరకు నానా మాటలు అనేశారు. టీవీ చానళ్లు యథాతధంగా మధ్యలో బీప్ లు వేసే అవకాశం లేకుండా టెలికాస్ట్ చేశారు. కొన్ని మీడియా సంస్థలు.. తమ పత్రికల్లో కూడా వార్తల్ని భారీగా అచ్చేశాయి. ఇదంతా చూసినప్పుడు.. పోసాని ఎందుకు వచ్చినట్లు? అన్న సందేహానికి తన మొదటి ప్రెస్ మీట్ లోనే బదులు ఇచ్చారు. మంత్రి పేర్ని నాని అంటే తనకు చాలా గౌరవమని.. ఇష్టమని.. అలాంటి ఉత్తముడ్ని ‘సన్నాసి’ లాంటి దారుణమైన మాట అనటమా? అన్న వేదన నుంచి వచ్చిన ఆగ్రహ ఆవేశపు మాటలతో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు.
పవన్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య నడిచే వార్ లోకి మధ్యలో దూరిన పోసానిని.. పవన్ కల్యాణ్ ను అభిమానించే వారు తిట్టటం మొదలు పెట్టారు. పోసానికి ఎలా అయితే పేర్ని నాని మీద అభిమానమో..పవన్ మీద కూడా సామాన్యులకు అభిమానం ఉండొచ్చు కదా? అదేం తప్పు కాదు కదా? పేర్ని నానిని సన్నాసి అన్నందుకు పోసాని బూతులు తిడితే.. పోసాని తిట్టిన దానికి పవన్ ను అభిమానించే వారు మరో అడుగు ముందుకు వేయటంలో తప్పేందన్నది కొందరి వాదన. ఇక్కడ మరో ధర్మ సందేహం కూడా వ్యక్తమవుతోంది.
పోసానిని ఇష్టారాజ్యంగా తిట్టే వారు..ఛండాలంగా బూతులు మాట్లాడే వారు.. దారుణమైన మెసేజ్ లు పెట్టే వారంతా పవన్ అభిమానులే ఎందుకు కావాలి? వారంతా పవన్ ను అభిమానించే వారేనని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఏదైనా కుట్ర కోణం ఉందేమో? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ.. నిజంగానే పోసానిని దారుణాతి దారుణంగా తిట్టేస్తున్న వారంతా పవన్ అభిమానులే అనుకుందాం. అలాంటి వేళలో.. వారి తాట తీయాల్సిన అవసరం ఉంది. అది కూడా మళ్లీ.. జీవితంలో నోరు విప్పేందుకు భయపడేలా చేయాలి.
అందుకు చేయాల్సింది.. సైబరాబాద్ పోలీసులకు కానీ.. లేదంటే పోసాని ఉండే రెండిళ్ల (తప్పుడు ఉద్దేశంతో కాదు సుమి.. ఆయనకు ఎల్లారెడ్డి గూడలో ఒక ఇల్లుఉంటే.. కొద్ది నెలల క్రితం మైహోం బూర్జాలో మరో లగ్జరీ ప్లాట్ లో కూడా ఉంటున్నట్లు చెబుతారు) పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు ఇవ్వాలి కదా? సార్..నా మీద మాటల దాడి జరుగుతుంది.. మా ఇంటి ఆడ మనిషి మీద నోటికి వచ్చినట్లు తిట్టిపోస్తున్నారు.. వారి మీద చర్యలు తీసుకోవాలని కోరాలి కదా? అలాంటిదెందుకు చేయటం లేదు?
నిప్పు మీద నీళ్లు పోయాలా? దాని మీద ఆవు నెయ్యి వేయాలా? బాగా చదువుకొని.. పెద్ద ఎత్తున సినిమా కథలు రాసి.. చాలా సినిమాల్లో నటించిన ఒక సెలబ్రిటీ వీధుల్లో తిట్టేసుకున్నట్లుగా తిట్టేసుకోవాలా? లేదంటే.. చట్టప్రకారం ఫిర్యాదు చేయాలా? అన్నది ప్రశ్న. పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం ద్వారా.. నిజంగానే తనను టార్గెట్ చేసిన వారంతా ఎవరన్న నిజం బయటకు వస్తుంది. ఎందుకంటే ఇవాళ పోసాని అయ్యారు. రేపొద్దున మరొకరు కావొచ్చు. ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారాజ్యంగా తిట్టేసే కన్నా.. కాస్త ప్లాన్డ్ గా వ్యవహరించటం ద్వారా తప్పుడు పనులు చేసే వారికి చెక్ పెట్టే వీలుంటుంది కదా? ఇదంతా వదిలేసి.. నోటికి వచ్చినట్లు బండబూతులు తిట్టేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న సత్యాన్ని పోసాని ఎప్పుడు గుర్తిస్తారు?