Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ పై పోసాని ఫైర్..!
By: Tupaki Desk | 27 Sep 2021 3:38 PM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటుడు, దర్శక రచయిత పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం మరియు మంత్రుల పై పవన్ చేసిన వ్యాఖ్యలపై పోసాని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు.
పోసాని మాట్లాడుతూ.. ''సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవడం వల్ల పవన్ కళ్యాణ్ 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. సాయి తేజ్ ఎవరి దయాదాక్షిణ్యాలతో హీరో అవ్వలేదు. వాళ్ల అమ్మ గారి పెంపకం. అతడు నటించిన 'చిత్రలహరి' సినిమాలో నేను తండ్రి పాత్ర చేశా. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం జరిగింది. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం. ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చి సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడాలి. అతడు మంచి వాడని, మంచి పనులు చేస్తున్నాడని చెప్పాలి. మేనమామ చిరంజీవి పోలికలు వచ్చాయి.. అతను ఇంకా పైకి రావాలని కోరుకోవాలి. కానీ సీఎం జగన్ ను, మంత్రులు, ఎమ్మెల్యేలను 'ఒరేయ్ సన్నాసుల్లారా.. ఎదవల్లరా..' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు'' అని అన్నారు.
'దిల్ రాజు రెడ్డి ఆ జగన్ రెడ్డితో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడు.. మీరు మీరు రెడ్డి కదా..' ఇలాంటి మాటలు అసలు ఎవరు మాట్లాడిన భాష?. జగన్ గారికి కుల పిచ్చి మత గజ్జి ఉందని ఎవరైనా నిరూపిస్తారా? ఆయన రెడ్డి. వాళ్ళ నాన్న గారి నుంచి క్రైస్తవులు అయ్యారు. వాళ్ళ ఇంట్లో బైబిల్స్ ఉంటాయి. ఎక్కడి వెళ్లినా చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్తారు. వాళ్ళ కుటుంబంతో కలిసి 15 రోజులు పులివెందులలో ఉన్నా. వాళ్లంతా అక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. జగన్ గారు పులివెందులకు వెళ్లకపోయినా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అలా ఎవరైనా గెలవగలరా? పవన్ మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడ్డారు? ఒకదానిలోనైనా గెలిచావా? అని పోసాని ప్రశ్నించారు.
గెలవడానికి నిజాయతీ అవసరం లేదు అనుకుందాం. మీ గొప్పతనం ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేస్తే పోలీసు కేసులు పెడదాం. ఈలోగా మీరొక పని చేయాలి. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మీరు పెద్ద హీరో. మీరు పరిష్కరించగలరు. ముందు ఆ సమస్యలను పరిష్కరించండి అని పోసాని పవన్ కు సూచించారు.
''జగన్ గారు అంటే నాకు అభిమానం. నేను చచ్చిపోయే వరకూ ఆయనపై అభిమానం ఉంటుంది. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు నాకు ఉంది. అయితే, ఆయన అలాంటి వ్యక్తికాదని నమ్ముతున్నా. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే తప్పు లేదు. అందుకు సాక్ష్యాలు చూపించాలి. అది నిజమైతే మీకు నమస్కారం పెడతాం. జనసేనకే సేవ చేస్తాం. చిరంజీవిగారు పార్టీ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులను అసభ్య పదజాలంతో అవమానించడం మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఎవరిని ప్రేరణగా తీసుకుని దూషిస్తున్నారు? ప్రజల్లో ఒకడిగా ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది'' అని పోసాని అన్నారు.