Begin typing your search above and press return to search.

హీరోల‌పై నిర్మాతల ముస‌లి క‌న్నీళ్లు!

By:  Tupaki Desk   |   26 Feb 2023 12:30 PM IST
హీరోల‌పై నిర్మాతల ముస‌లి క‌న్నీళ్లు!
X
టాలీవుడ్ లో అవ‌కాశాలు లేని హీరోల ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తొంద‌ర‌ప‌డి కింద‌కు దిగ‌లేరు. పైకి ఎక్కుదామంటే లిప్ట్ ఇచ్చే వారుండ‌రు. నాలుగైదు సినిమాలు చేసి త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా స్థిర‌ప‌డ‌టం అన్న‌ది కొంద‌రితో కాని ప‌ని. అలాంటి వాళ్లు ఇండ‌స్ర్టీకి దూర‌మవుతుంటారు. అయితే ఆ హీరోల జీవితాల్లో ఏదైన దుర‌ఘ‌ట‌న జ‌రిగిందంటే? టాలీవుడ్ నిర్మాత‌ల ఏ రేంజ్ లో ముస‌లి క‌న్నీరు కార్చుతారో? ఇటీవ‌లే ఓ నిర్మాత‌ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

ఆ హీరోకి నా సినిమాలో అవ‌కాశం ఇవ్వాల‌నుకున్నాను. అత‌న్నే పెట్టి హీరోగా ఓ సినిమా చేద్దాం అనుకున్నాను.. కాదు కాదు ఏకంగా పాన్ ఇండియా సినిమా చేసేద్దాం అనుకున్నామ‌ని మ‌రికొంత మంది మీడియా ముందు ప‌గిలే ప్ర‌గ‌ల్భాల గురించి చూస్తూనే ఉంటాం. ఇటీవ‌లే ఓ న‌టుడి విష‌యంలో ఓ అగ్ర నిర్మాత ఇలాగే స్పందించాడు. ప్ర‌తిగా సోష‌ల్ మీడియాలో అడ్డంగా బుక్క‌య్యాడు.

హీరోలు సజీవంగా ఉన్నంత కాలం అవ‌కాశాలివ్వ‌రు....నిర్జీవులైన త‌ర్వాత ఎక్క‌డ లేని ఆలోచ‌న లు.. ..సింప‌తి దిగొచ్చేస్తుందంటూ నెటి జ‌నులు మండి ప‌డ్డారు. గ‌తంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో విష‌యంలో కొంత మంది నిర్మాత‌లు ఇలాగే స్పందించారు. తొంద‌ర‌ప‌డి త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నా డంటూ ఓ నిర్మాత పెద్ద క్లాస్ తీసుకున్నాడు. అదే నిర్మాత త‌ర్వాత మ‌రో హీరో విష‌యంలోనూ ఇలాంటి క‌బుర్లే చెప్పాడు. ఆ త‌ర్వాత అలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగాయి. కానీ మాట నిల‌బెట్టుకున్న సంద‌ర్భం మాత్రం క‌నిపించ‌లేదు.

అయితే అప్పుడంత సోష‌ల్ మీడియాలో లేక‌పోవ‌డంతో స‌ర‌దు నిర్మాత త‌ప్పించుకోగ‌లిగాడు. అన్ని చేసాం..ఇన్ని చేసాం అని గొప్ప‌లు కాదు చెప్పుకోవాల్సింది..మూవీ మోఘ‌ల్ రామానాయుడు గారిలా కొత్త వాళ్ల‌ని తెర‌పైకి తీసుకురండి..ప్రతిభావంతుల్ని గుర్తించండి అంటూ నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ లు పెడుతున్నారు. మ‌రి ఈ ప‌రిణ‌మాలు..అనుభ‌వాలు భ‌విష్య‌త్ లో ఎలాంటి మార్పుల‌కు దోహ‌దం చేస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.