Begin typing your search above and press return to search.

100 కోట్ల‌కు ప్ర‌ముఖ స్టార్ హీరో బంగ్లా విక్ర‌యం

By:  Tupaki Desk   |   18 Feb 2023 3:03 PM IST
100 కోట్ల‌కు ప్ర‌ముఖ స్టార్ హీరో బంగ్లా విక్ర‌యం
X
పాపుల‌ర్ వెట‌ర‌న్ హీరో రాజ్ క‌పూర్ సెంటిమెంట్ బంగ్లాను ప్ర‌ముఖ కార్పోరెట్ కంపెనీ ఛేజిక్కించుకుంది. ముంబైలోని దివంగత ప్రముఖ నటుడు రాజ్ కపూర్ చెంబూర్ బంగ్లాను గోద్రెజ్ ప్రాపర్టీస్ భారీ మొత్తంలో చెల్లించి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ డీల్ విలువ‌ 100 కోట్లు. ఈ ఆస్తి ముంబై చెంబూర్ లొకేషన్ లోని డియోనార్ ప్రాంతంలో ఉంది. ఈ భూభాగం విస్తీర్ణం 4265.50 చ.మీ. బదిలీ ఒప్పందంపై ఫిబ్రవరి 16న రణధీర్ రణబీర్ రాజ్ కపూర్- రీమా జైన్-నితాషా నందా- నిఖిల్ నందా-నీతూ రిషి కపూర్ సంతకాలు చేశారని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. గ‌త ఏడాది రాజ్ క‌పూర్ స్టూడియోస్ ని ఛేజిక్కించుకున్న ఇదే ఫ‌ర్మ్ ఇప్పుడు ఈ బంగ్లాను కొనుగోలు చేయ‌డం ముంబై స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

పాపుల‌ర్ మనీ కంట్రోల్ నివేదిక‌ ప్రకారం... గోద్రెజ్ ప్రాపర్టీస్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. ''రాజ్ కపూర్ కి చెందిన‌ ఒక ఎకరం బంగ్లాను గోద్రేజ్ ద‌క్కించుకుంది. రూ.500 కోట్ల విలువ చేసే లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం ప్ర‌య‌త్న‌మిది'' అని ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ ఐకానిక్ ప్రాజెక్ట్ ను మా పోర్ట్ ఫోలియోకు జోడించినందుకు సంతోషిస్తున్నాం. ఈ అవకాశాన్ని మాకు అప్పగించినందుకు కపూర్ కుటుంబానికి కృతజ్ఞతలు'' అని గోద్రెజ్ ప్రాపర్టీస్ MD -CEO గౌరవ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రీమియం డెవలప్ మెంట్ బంగ్లాలకు డిమాండ్ బలంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ చెంబూర్ లో మా ఉనికిని మరింత బలోపేతం చేయడానికి స‌హ‌క‌రిస్తుంద‌ని గోద్రేజ్ సీఈవో గౌర‌వ్ వెల్ల‌డించారు. మేము ఈ ప్రాజెక్ట్ కొనుగోలుదారులు నివాసితులకు దీర్ఘకాలిక విలువను సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఇక్క‌డ‌ అత్యుత్తమ నివాస కమ్యూనిటీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని అన్నారు.

150 కోట్ల‌కు RK స్టూడియో డీల్

పాపుల‌ర్ న‌టుడు నిర్మాత దివంగ‌త‌ రాజ్ కపూర్ అతిపెద్ద వారసత్వ సంప‌ద అయిన రాజ్ క‌పూర్ స్టూడియోస్ ని గోద్రేజ్ కి చెందిన రియ‌ల్ ఫ‌ర్మ్ కి గ‌త ఏడాది విక్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇది సంవత్సరాలుగా చాలా మంది సినీ కళాకారులకు నిలయంగా ఉండేది. కపూర్ కుటుంబం సంయుక్తంగా స్టూడియోను విక్రయించ‌గా అక్క‌డ సుమారు 2.2 ఎక‌రాల్లో గోద్రేజ్ సంస్థ భారీ రియ‌ల్ వెంచ‌ర్లు వేసింది.

ఈ ఆస్తి విలువ‌ను క‌పూర్ ఫ్యామిలీ రూ. 170-190 కోట్ల‌కు కోట్ చేయ‌గా మార్కెట్ రేటు రూ. 150 కోట్లకు దగ్గరగా ఉందని క‌థ‌నాలొచ్చాయి. 9018.85 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఐకానిక్ ల్యాండ్ ఇది.

మొత్తం ఐదుగురు కపూర్ తోబుట్టువుల ఆస్తిపై సంబంధిత 1/5వ వంతు అవిభక్త షేర్లు- హక్కు- టైటిల్ డీడ్ వ‌గైరా చ‌ర్చ‌లు సాగాక అమ్మ‌కం పూర్త‌యింది. ముంబైకి చెందిన గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జిపిఎల్) కొనుగోలు చేసిన ఐకానిక్ ఆర్‌.కె స్టూడియోస్‌లో విలాసవంతమైన ఫ్లాట్ లను విక్రయించడానికి సిద్ధం చేసింది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫిల్మ్ స్టూడియోను 72 ఏళ్ల క్రితం లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ స్థాపించారు. ఒకప్పుడు కపూర్ చిత్ర నిర్మాణ సంస్థ RK ప్రధాన కార్యాలయంలో ఉన్న ఆస్తిలో మూడు - నాలుగు బెడ్ రూమ్ లతో కూడిన 'కలెక్టర్స్ ఎడిషన్ రెసిడెన్స్' ని నిర్మించి గోద్రేజ్ ప్రాప‌ర్టీస్ అమ్మ‌కాలు సాగిస్తోంది.

GPL విలాసవంతమైన ఫ్లాట్ల కోసం ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించ‌గా... కంపెనీ వెబ్ సైట్ ప్రకారం, మూడు బెడ్ రూమ్ ల నివాసం ధర రూ. 5.7 కోట్ల నుంచి ప్రారంభం కాగా.. నాలుగు బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ. 10.9 కోట్ల నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని టాక్ వినిపించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.