Begin typing your search above and press return to search.

హీరో అవుతున్న పాపులర్ డాన్స్ మాస్టర్ !!

By:  Tupaki Desk   |   27 Dec 2020 6:00 PM IST
హీరో అవుతున్న పాపులర్ డాన్స్ మాస్టర్ !!
X
త‌న‌వైన ట్రేడ్ మార్క్ కొరియోగ్ర‌ఫీ స్టెప్పుల‌తో యూత్ ఫేవ‌రెట్ గా మారారు జానీ మాస్టార్. ఎంతో మంది సూపర్ స్టార్ల పాటలకి కోరియోగ్రఫి చేసిన పాపులర్ డాన్స్ మాస్టర్ ఆయ‌న‌. జానీ ఇప్పుడు హీరోగా కొత్త అవతారం ఎత్తనున్నారు.

రౌడి బేబీ- బుట్ట బొమ్మ వంటి సూపర్ హిట్ పాటలతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన జానీ మాస్టర్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుజీ విజువల్స్ పతాకం పై వెంకట్ రమణ. కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు- తమిళ- హిందీ - కన్నడ భాషల్లో 150 కి పైగా చిత్రాలకు కోరియోగ్రఫీ చేసి ఎంతో పేరు సంపాదించి ఎన్నో అవార్డులు గెలుచుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు హీరోగా తన ప్రస్థానం మొదలుపెట్టడానికి సిద్దమయ్యారు. తనదంటూ ప్రత్యేకమైన డాన్స్ శైలి తో మెలకువలతో హీరోల ఫాన్స్ ని ఆకట్టుకునే జానీ మాస్టర్ హీరోగా కూడా ప్రేక్షకులని పూర్తిగా ఆకట్టునే స‌మ‌ర్థుడు అనడంలో సందేహమేం లేదు. త‌న‌కంటూ ఓ ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేయ‌డంలో `బాషా` రేంజు స్టైలుంద‌ని అని నిరూపిస్తేనే పోటీని త‌ట్టుకోవ‌డం సాధ్యం.