Begin typing your search above and press return to search.

కొరియోగ్రాఫ‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణంతో ప‌రిశ్ర‌మ శోక‌సంద్రం!

By:  Tupaki Desk   |   21 April 2023 9:30 PM IST
కొరియోగ్రాఫ‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణంతో ప‌రిశ్ర‌మ శోక‌సంద్రం!
X
మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ గురువారం హఠాన్మరణం చెందారు. ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. అయితే మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు ఏంటి? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

పోలీసులు కేసు న‌మోదు చేసారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు అవ‌స‌రమ‌వ్వ‌డంతో ఆ ర‌కంగా కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

రాజేష్ మ‌ర‌ణం ప‌ట్ల‌ చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది. ఆయ‌న సేవ‌ల్ని ప‌రిశ్ర‌మ గుర్తు చేసుకుం టుంది. ఫేమ‌స్ డాన్సు గ్రూప్ ఎలక్ట్రో బ్యాటిల్స్ ను రాజేష్ స్వ‌యంగా స్థాపించారు. ఫెఫ్కా డ్యాన్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గానూ ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజేష్ మ‌ర‌ణం గురించి కొన్ఇన ర‌కాల కార‌ణాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నటి బీనా ఆంటోనీ రాజేష్ మాస్టర్ ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అతడు తీసుకున్న రెండో నిర్ణయం ఎంతో నష్టానికి దారితీసిందంటూ పోస్ట్ పెట్టారు.

మరణానికి గల కారణం ఏంటి? అని అభిమానులు ఆమెను ప్రశ్నించగా.. ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందంటూ బదులిచ్చారు. అయితే ఆయ‌న తీసుకున్న రెండ‌వ నిర్ణ‌యం ఏంట‌న్న‌ది బీనా కూడా ర‌హస్యంగా ఉంచారు. పోలీసుల విచార‌ణ‌లో వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.రాజేష్ మరణ వార్త షాక్ కు గురి చేసినట్టు ప్రముఖ నటి దేవి చందనా స్పందన విచారం వ్యక్తం చేశారు.

సినిమాటిక్ బాలీవుడ్ డ్యాన్స్ ను తన జీవితంలోకి తీసుకొచ్చిన మొద‌టి వ్యక్తి అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇంకా రాజేష్ అనుబంధం ఉన్న వారంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా విచారం వ్య‌క్తం చేస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇంకా మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని..త‌నొక గొప్ప టెక్నీషియ‌న్ అని రాజేష్ ప‌నిత‌న్నాన్ని కొనియాడుతున్నారు.