Begin typing your search above and press return to search.

#RRR : ఒక హీరోయిన్‌ ఫిక్స్‌?

By:  Tupaki Desk   |   25 Jan 2019 11:53 AM GMT
#RRR : ఒక హీరోయిన్‌ ఫిక్స్‌?
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లు కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం రెండవ షెడ్యూల్‌ తాజాగా ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్‌ లో యాక్షన్‌ సీన్స్‌ ను చిత్రీకరించిన దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం కూడా చరణ్‌, ఎన్టీఆర్‌ ల కాంబోలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ ను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎంపిక విషయంపై స్పీడ్‌ గా చర్చలు జరుపుతున్నారట. వచ్చే నెల నుండి హీరోయిన్స్‌ తో చిత్రీకరణకు దర్శకుడు రాజమౌళి ప్లాన్‌ చేశాడట.

ఇప్పటికే ఎంతో మంది పేర్లను పరిశీలించిన రాజమౌళి ఒక షార్ట్‌ లిస్ట్‌ తయారు చేశాడని, ఆ షార్ట్‌ లిస్ట్‌ లో బాలీవుడ్‌ బ్యూటీ పరిణితి చోప్రా పేరుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. డివివి ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థకు చెందిన వారు పరిణితి చోప్రాను సంప్రదించడం, ఆమె రాజమౌళి సినిమా అనగానే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం రెండు జరిగిందని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్‌ లో పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన పరిణితి చోప్రా ఈమద్య కాలంలో అక్కడ కాస్త సందడి తగ్గింది. కొత్త హీరోయిన్స్‌ రావడంతో ఈమెకు ఆఫర్లు తగ్గాయి. ఇలాంటి సమయంలో రాజమౌళి నుండి వచ్చిన ఆఫర్‌ కు వెంటనే ఓకే చెప్పిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఒక హీరోయిన్‌ గా బాలీవుడ్‌ ముద్దుగుమ్మను ఎంపిక చేసిన రాజమౌళి మరో హీరోయిన్‌ గా సౌత్‌ బ్యూటీని ఎంపిక చేస్తే అభిమానులతో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మరో హీరోయిన్‌ ను కూడా బాలీవుడ్‌ నుండే ఎంపిక చేస్తారనే టాక్‌ కూడా వస్తుంది. ఇక మూడవ ముద్దుగుమ్మగా ఒక హాలీవుడ్‌ నటిని ఎంపిక చేయబోతున్నారు. పరిణితి చోప్రా హీరోయిన్‌ గా ఎంపికయిన విషయంపై చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.