Begin typing your search above and press return to search.
'చీకటి గదిలో చితక్కొట్టుడు' డైరెక్టర్ నుంచి ''చితక్కొట్టుడు 2'
By: Tupaki Desk | 4 Nov 2020 1:40 PM ISTతమిళ దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ అడల్ట్ హర్రర్ కామెడీ జోనర్ లో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అదిత్ - నిక్కీ - భాగ్యశ్రీ - రమేష్ కుమార్ - హేమంత్ లు కలిసి నటించిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో సంతోష్ పి.జయకుమార్ దీనికి కొనసాగింపుగా మరో అడల్ట్ కామెడీ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ''చితక్కొట్టుడు 2'' అనే టైటిల్ ని ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
''చితక్కొట్టుడు 2'' ఫస్ట్ లుక్ తోనే సినిమాలో ఏమి చూపించబోతున్నారో చిత్ర యూనిట్ వెల్లడించింది. బీచ్ లో ఇద్దరు యువకులు అరటి పండ్లు పట్టుకొని నాటీ పోజ్ ఇవ్వగా.. వారి మధ్యలో ఓ హాట్ బ్యూటీ టూ పీస్ బికినీ ధరించి వయ్యారంగా నిలబడివుంది. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాకి మించి అడల్ట్ కంటెంట్ తో రాబోతోందని పోస్టర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ 'ఏ' సర్టిఫికేట్ సినిమాకి బళ్లు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా ప్రసాద్ ఎస్.ఎన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రాక్ ఫోర్ట్ టి.మురగనాథమ్ సమర్పణలో ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. హరి భాస్కరన్ నిర్మించారు. ''చితక్కొట్టుడు 2'' రిలీజ్ తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.