Begin typing your search above and press return to search.
నైజాం లిరిసిస్టుకి పాప్ స్టార్ స్మిత ధాతృ సాయం
By: Tupaki Desk | 29 Oct 2021 1:20 PM ISTటాలీవుడ్ లో చార్ట్ బస్టర్ పాటలకు సాహిత్యం అందించారు కందికొండ. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలున్నాయి. పూరీ జగన్నాథ్ సహా టాలీవుడ్ అగ్ర దర్శకులతో అతడికి సాన్నిహిత్యం ఉంది. పూరి అన్ని సినిమాలకు ఇంచుమించుగా అతడు పాటలు రాశారు. నైజాం యాస భాషను ప్రతిబింబించే మాస్ పాటలను అతడు రాసాడు. చక్కని మెలోడీలకు సాహిత్యం అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి- దేశముదురు- ఇడియట్- చిరుత- టెంపర్ వంటి పలు సినిమాలకు లిరిక్స్ అందించారు. అయితే ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
అతడి అనారోగ్యం కాంప్లికేటెడ్ అని కూడా తెలుస్తోంది. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ శనివారం నాడు ఆయనకు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వెన్ను భాగానికి శస్త్ర చికిత్స జరగనుందని తెలిసింది.
అయితే దీనికి అయ్యే మెజారిటీ ఖర్చును పాప్ స్టార్ స్మత సాయం చేయనున్నారని సమాచారం. స్మిత ఇటీవల కరోనా క్రైసిస్ కష్టకాలంలో సినీ కార్మికులు సహా ప్రజలకు తనవంతు సాయమందించారు. సేవాకార్యక్రమాలతో తన పెద్ద మనసుతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు కందికొండకు చికిత్స చేయించేందుకు ముందుకు రావడం పరిశ్రమ వర్గాల్లో చర్చకు వచ్చింది. స్మిత స్ఫూర్తితో అతడికి సాయం అందించేందుకు ఇతర సెలబ్రిటీలు ముందుకు వస్తారేమో చూడాలి. కష్టంలో ఉన్న సహోదరుడికి ఇతర లిరిసిస్టుల నుంచి అసోసియేషన్ నుంచి సాయం అందుతుందనే భావిస్తున్నారు.