Begin typing your search above and press return to search.

వీడియో : ఫైర్‌ బ్రాండ్‌.. బోల్డ్‌ బ్యూటీ ఇద్దరు 'లాకప్‌' లో ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   24 Feb 2022 8:00 PM IST
వీడియో : ఫైర్‌ బ్రాండ్‌.. బోల్డ్‌ బ్యూటీ ఇద్దరు లాకప్‌ లో ఏం చేస్తున్నారు?
X
బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ హీరోయిన్ గా ఇప్పటికే ఎన్నో సినిమా లతో సెన్షేషనల్‌ స్టార్ గా నిలిచింది. మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకునేందుకు తెగ ఉబలాట పడే కంగనా రనౌత్ మరో కొత్త రంగంలో తన ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్ పలువురు హోస్ట్‌ లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తాజాగా కంగనా రనౌత్‌ కూడా 'లాకప్‌' అనే ఒక షో కు హోస్టింగ్‌ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

ఏక్తా కపూర్‌ నిర్మాణంలో కంగనా రనౌత్‌ ఈ లాకప్‌ షో ను చేస్తోంది. బాలాజీ టెలీఫిల్మ్స్ ఓటీటీ మరియు ఎంఎస్స్ ప్లేయర్‌ లో ఈ షో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. లాకప్ షో లో వారం వారం ఒక గెస్ట్‌ తో కంగనా సందడి చేయబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ షో లో మోస్ట్‌ బోల్డ్‌ బ్యూటీ అంతకు మించి వివాదాస్పద తార అయిన పూనమ్‌ పాండే ఉండబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది.

పూనమ్‌ పాండే మరియు కంగనా కాంబో ఎపిసోడ్‌ షో కు ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉందని ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. బోల్డ్‌ అనే పదం మరియు కాంట్రవర్సీ అనే పదంకు ప్రత్యక్ష నిదర్శణం అనిపించేలా ఉండే పూనమ్‌ పాండే ఈ షో తో ఎంటర్‌ టైన్‌మెంట్‌ చేయడం ఖాయం అంటూ ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. హిందీ ప్రేక్షకులు ఈ షో తో కంగనా ఎంతటి కాంట్రవర్సీ క్రియేట్‌ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కంగనా ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంది. సినిమా కు దర్శకత్వం వహిస్తూ ఉండే కంగనా ఇప్పుడు ఈ షో కు హోస్ట్‌ చేయడం ద్వారా మరింతగా ఆమె ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్‌ గా ఆమె సాదించిన పాపులారిటీ ఖచ్చితంగా 'లాకప్‌' షో కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబచ్చన్‌ మొదలుకుని షారుఖ్‌ ఖాన్‌.. సల్మాన్‌ ఖాన్‌.. అజయ్ దేవగన్‌.. అక్షయ్ కుమార్‌.. ఇంకా ఎంతో మంది స్టార్స్ హోస్టింగ్‌ చేశారు.. ఇంకా హోస్ట్‌ లుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్ పలువురు ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు ఓటీటీ ల కోసం హోస్టింగ్‌ చేసి సక్సెస్ అయ్యారు. కనుక కంగనా కూడా ఖచ్చితంగా లాకప్ తో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయడంతో పాటు సరికొత్త వివాదాలకు తెర తీయడం ఖాయం అనిపిస్తుంది.

సెలబ్రెటీల రహస్యాలను ఈ షో తో ఆమె బయటకు తీసుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొదటి ఎపిసోడ్‌ ఈనెల 27న స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ కూడా ఖచ్చితంగా సాలిడ్ వ్యూస్ ను దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది.