Begin typing your search above and press return to search.

ఏం చూపించాలో ఆమెకి బాగా తెలుసు..!

By:  Tupaki Desk   |   21 Dec 2016 5:00 PM IST
ఏం చూపించాలో ఆమెకి బాగా తెలుసు..!
X
చాలామంది హీరోయిన్ల‌కు సినిమాల్లో వేసిన పాత్ర‌ల‌తో పాపులారిటీ వ‌స్తుంది. తెర మీద కనిపించే తీరును బ‌ట్టీ ఇమేజ్ తెచ్చుకుంటారు. కానీ, పూనమ్ పాండే మాత్రం డిఫ‌రెంట్‌! సోష‌ల్ మీడియాతోనే ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌ను ఊరించేస్తుంది. ఒక సెల్ఫీ తీసుకుని ఇలా ఆన్‌ లైన్‌ లో వ‌దిలిందో లేదో... ఇట్టే వైర‌ల్ అయిపోతూ ఉంటాయి. ఈ మ‌ధ్య‌నే మాల్దీవ్స్‌ కి హాలీడేస్‌ కి వెళ్లొచ్చి ఎలాంటి ఫొటోలు పెట్టిందో చూశాం క‌దా! త‌న వేసుకున్న బ్రా డిజైన్ ఎలా ఉందో చెప్పండీ అంటూ అభిమానుల‌ను రెచ్చ‌గొట్టిన సంగ‌తి తెలిసిందే క‌దా. అలాంటి ఫొటో పెడితే యూత్ ఊరకుంటారండీ... ఏ రేంజిలో కామెంట్లు పెట్టారు! స‌రే, ఆ హ్యంగోవ‌ర్‌ నుంచి కుర్రాళ్లు ఇంకా బ‌య‌ట‌ప‌డ్డారో లేదో... తాజాగా పూన‌మ్ పాండే మ‌రో ఫొటో పెట్టేసింది.

అయితే, ఈసారి క్యాప్ష‌న్ ఏదీ పెట్ట‌కుండానే ఇదిగో ఈ ఫొటో పెట్టేసింది! త‌న ముఖం క‌నిపించ‌కుండా ఇలా సెల్ఫీ దిగింది. అచ్చంగా ఇదే స్టిల్‌ ను సోషల్ మీడియాలోకి వ‌దిలేసింది. ‘అదేంటీ క‌నీసం ముఖం చూపిస్తే బాగుండు’ క‌దా అని అంటారా. అక్క‌డ ఫొటో షేర్ చేసింది ఎవ‌ర‌నుకున్నారు... పూన‌మ్ పాండే! త‌న అభిమానుల‌కు ఏం కావాలో ఆమెకు తెలుసు క‌దా! అదేనండీ... ఆ మ‌ధ్య మాల్దీవుల్లో ఓ కొత్త బ్రా వేసుకుని ఎలా ఉందో చెప్పండీ అంటూ ఫొటోపెట్టింది. ఇది కూడా కొత్త‌దే అయి ఉంటుంద‌నీ, "ఈ డిజైన్ ఎలా ఉందో చూడండీ" అని పోస్ట్ పెట్టింద‌ని అనుకుందాం.

‘పాపులారిటీ కోసం ఎవ‌రైనా ఇలాంటి ఫొటోలు పెడ‌తారా’ అని అడుగుతారా..? అవత‌ల ఉన్న‌ది పూన‌మ్ పాండే కదండీ. పూన‌మ్ దెబ్బ‌కి ట్విట్ట‌ర్ భ‌య‌ప‌డుతోంద‌ని చెప్పాలి! ఇప్పుడు ఇన్‌ స్టాగ్రామ్ మీద ప‌డిందీ అమ్మ‌డు. ఆమె ఎక్క‌డ అడుగుపెడితే అక్క‌డ అభిమానుల కోలాహ‌లం ఉండ‌టం అనేది స‌ర్వసాధార‌ణ‌మైన విష‌యం క‌దండీ. సో... ఆ విధంగా పూన‌మ్ త‌న హాట్ సెక్సీ అప్పీల్‌ను సెల్ఫీల ద్వారా పెంచుకుంటూ వ‌స్తోంద‌ని చెప్ప‌డం బాట‌మ్ లైన్‌!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/