Begin typing your search above and press return to search.

పూన‌మ్ పాండే హాట్ ఛాలెంజ్ చూశారా?

By:  Tupaki Desk   |   4 Jan 2017 1:54 PM IST
పూన‌మ్ పాండే హాట్ ఛాలెంజ్ చూశారా?
X
ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ గా వార్త‌ల్లో ఉండ‌టం పూన‌మ్ పాండేకి బాగా తెలుసు! ఏం చేస్తే మీడియా అటెన్ష‌న్ త‌న‌వైపు తిరుగుతుందో ఆమెకి బాగా వంట‌ప‌ట్టేసింది. ఈ మ‌ధ్య‌నే హాలీడేస్ కి వెళ్లి... హాట్ హాట్ ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో వ‌దిలిన సంగ‌తి తెలిసిందే. త‌న కొత్త బ్రా డిజైన్ చూడ‌మంటూ అభిమానుల‌ను ఊరించింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా జింగిల్ బూబ్స్ అంటూ ఓ వీడియోని సోష‌ల్ మీడియాలోకి వ‌దిలేసింది. అది ఓ రేంజిలో వైర‌ల్ అయిపోయింది. ఈ అందాల విందుల హ్యాంగ్ ఓవ‌ర్ నుంచి యూత్ బ‌య‌ట‌కి రాక‌ముందే తాజాగా మ‌రో హాట్ బాంబ్ పేల్చింది!

కేవ‌లం త‌న ఎసెట్స్ ను న‌మ్ముకుని తాజాగా మ‌రో వీడియో త‌యారు చేసింది. ఈ వీడియోకి కేర్ ఫ్రీ హ్యాండ్స్ ఫ్రీ అంటూ టైటిల్ కూడా పెట్టింది. ఓర‌కంగా ఇదో గ్లాస్ ఛాలెంజ్ అనుకోండి! బీచ్ లో టూపీస్ బికీనీ వేసుకుని... అలాఅలా మాట్లాడుతూ ఒక్క‌సారి కెమెరాకి ఫేవ‌ర్ స్టిస్ ఇస్తుంది. అంతే, ఆమె త‌న ఎద సంప‌ద‌ల మ‌ధ్య ఓ జ్యూస్ గ్లాస్ ను పెట్టి కేర్ ఫ్రీగా బీచ్ లో న‌డుస్తూ ద‌ర్శ‌న‌మిచ్చింది.

బీచ్ అంతా క‌లియ‌దిరుగుతూ మాట్లాడుతూ.. మ‌ధ్య‌లో త‌న గ్లాస్ తీసి సిప్ చేస్తూ.. మ‌ళ్లీ ఎద సంప‌ద‌ల మ‌ధ్య పెట్టేస్తూ... గ్లాస్ ఛాలెంజ్ విసిరింది పూన‌మ్ పాండే. ఈ రేంజిలో ఛాలెంజ్ విసిరితే ఏమౌతుంది... సోష‌ల్ మీడియాలో ఈ వీడియో కూడా వైర‌ల్ అయిపోయింది. ఏదైతేనేం కేవ‌లం త‌న అందాల‌ను న‌మ్ముకునే బాగా పాపుల‌ర్ అయింది పూన‌మ్‌. భ‌విష్య‌త్తులో ఇలాంటి వీడియోలు త‌న నుంచి చాలా వ‌స్తాయ‌ని చెబుతోంది. అంటే.. పూన‌మ్ ఫ్యాన్స్ కు ఈ ఏడాది క‌న్నుల పండుగ అన్న‌మాట‌!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/