Begin typing your search above and press return to search.

లేడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ కు అంకితం!

By:  Tupaki Desk   |   3 Sept 2018 2:28 PM IST
లేడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ కు అంకితం!
X
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి పూనమ్ పాండే పరిచయం అవసరం లేని పేరు. హిందీ సినిమాలతో పాటుగా 'మిస్ మాలిని & కొ' అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. సినిమాలే కాకుండా హాట్ ఫోటో షూట్లతో - ఘాటు వీడియోలతో నెటిజనులకు నిద్ర లేకుండా చేయడంలో ఆమెకు ఆమే సాటి. తాజాగా ఈ పూనమ్ తన రెండో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

జస్ట్ అంతే.. అయితే పెద్ద న్యూస్ కాదు కదా! నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కు పూనమ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా తన తాజా చిత్రం టైటిల్ 'లేడీ గబ్బర్ సింగ్' అని తెలుపుతూ ఆ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సర్ కు అంకితం ఇస్తున్నానని ప్రకటించింది. అంతే కాదు "నేను పవన్ కళ్యాణ్ సర్ చేసిన దాన్లో 1% లేడీ గబ్బర్ సింగ్ లో చేయగలిగినా అయన వీరాభిమానిగా చాలా సంతోషిస్తానని చెప్పుకొచ్చింది. నాకు అయన నిజమైన ఇన్ స్పిరేషన్" అంటూ #PKFan #HBDJanaSenaniPawanKalyan హ్యాష్ ట్యాగ్ లు పెట్టింది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆమె చేసిన పని నచ్చడంతో సినిమాకు చాలామంది అల్ ది బెస్ట్ చెప్పారు. ఆమె ట్వీట్ కు 3.4K లైక్స్ రావడం విశేషం. ఒక్క ట్వీట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను మెప్పించింది. ఇదే కాదు పూనమ్ రీసెంట్ గా ఈ సినిమా రెమ్యునరేషన్ అంతా కేరళ వరద బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటించి అందరి ప్రశంసలు చూరగొంది. హాట్ బ్యూటీనే కాదు కైండ్ హార్ట్ ఉన్న బ్యూటీ అని నెటిజనులచే అనిపించుకుంది.