Begin typing your search above and press return to search.

‘గురు’ అనే పదాన్ని హ్యాష్ టాగ్ ఇస్తూ పూనమ్ కోర్ ట్వీట్

By:  Tupaki Desk   |   29 Sept 2021 10:00 AM IST
‘గురు’ అనే పదాన్ని హ్యాష్ టాగ్ ఇస్తూ పూనమ్ కోర్ ట్వీట్
X
అప్పుడప్పుడు తన పోస్టులతో వార్తల్లోకి వచ్చే పూనమ్ కౌర్.. అనూహ్యంగా మరోసారి తెర మీదకు వచ్చారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికరంగానూ.. అందరి చూపు అటువైపు పడేలా చేసింది. పవన్ వర్సెస్ వైసీపీ నేతలతో పాటు.. ఇండస్ట్రీకి చెందిన కొందరు ఆయనపై తీవ్ర పదజాలంతో ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతున్న వేళ.. ఆమె పెట్టిన పొలిటికల్ ట్వీట్ ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది.

మొదటి ట్వీట్ లో దాసరి నారాయణరావు నటించిన ‘రౌడీ దర్బార్’ మవీలోని ‘ఇంద్రలోకం పార్టీ.. చంద్రలోక్ం పార్టీ.. మీ జెండాలకు వేల వేల దండాలయ్యా.. మీ పార్టీల్లో గూండాల్ని చేర్చకండయ్యా’ అనే వీడియో సాంగ్ ను పోస్టు చేసి.. తాజా హాట్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.

దయచేసిన ఆ పాటను అందరూ వినాలంటూ.. ప్రస్తుత రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై తనకున్న ఆగ్రహాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇంకో ట్వీట్ లో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

చిత్ర పరిశ్రమలో ఏకైక గురువు దాసరిగారు. తనకు ఆయన తండ్రిలాంటి వారని.. ఆయన్నుచాలా మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. ఎక్కడో ఉన్న ఆయనకు తానీ రోజున ఒక సందేశాన్ని తెలియజేయాలని అనుకుంటున్నానని.. భగవంతుడు తన పోస్టును ఆయనకు చేరవేస్తాడన్న ఆమె.. ‘ఐ మిస్ యూ’ అన్న మాటతో పాటు.. ఇండస్ట్రీలో ఒకే ఒక్క గురువు దాసరిగారు అంటూ పేర్కొన్నారు. గురువు అనే పదానికి.. దాసరి అనే పదానికి హ్యాష్ టాగ్ ఇచ్చిన ఆమె పోస్టు ఇప్పుడు కొత్త చర్చకు కారణంగా మారిందని చెప్పాలి.