Begin typing your search above and press return to search.

#ప‌చ్చ‌బొట్టు.. పూన‌మ్ ఛాతీపై త్రిశూలం నాగు పాము డిజైన్

By:  Tupaki Desk   |   1 Dec 2020 11:44 AM GMT
#ప‌చ్చ‌బొట్టు.. పూన‌మ్ ఛాతీపై త్రిశూలం నాగు పాము డిజైన్
X
ర‌క‌ర‌కాల వివాదాల్లో న‌టి పూన‌మ్ కౌర్ పేరు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ``నా అమాయకత్వం అజ్ఞానం నన్ను గందరగోళంలో పడేసింది. నేను దాని నుండి ఎలా బయటపడాలో తెలియ‌లేదు..`` అంటూ అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు న‌టి పూన‌మ్ కౌర్. రాజ‌కీయాల్లో అప‌స‌వ్య దిశ గురించి మీడియా ఇంట‌ర్వ్యూల్లో త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంలో పూన‌మ్ ప‌లు వివాదాంశాల‌తో హాట్ టాపిక్ అయ్యారు. ఆ సంద‌ర్భంలో ఆమె వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ అభిమానుల్లో చ‌ర్చ‌కొస్తూ ఉన్నాయి. అలాగే త‌న‌పై సోష‌ల్ మీడియాల్లో త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసిన వారిపైనా సైబ‌ర్ క్రైమ్ కి పూన‌మ్ ఫిర్యాదు చేశారు.

నన్ను చాలా మంది మానసికంగా వేధించారు. వారంతా నా జీవితంతో ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది గత రెండేళ్లుగా కొనసాగుతోంది. నేను ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నాను ఎందుకంటే నేను మాట్లాడితే అది చాలా మందిని ప్రభావితం చేస్తుంది. చాలా జీవితాలు నాశనమవుతాయి. ఈ కారణంగా నా కుటుంబం ఇప్పటికే చాలా మానసికంగా వేదన‌కు గురైంది. నా వ్యక్తిగత జీవితం ముక్కలైంది. నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.. అంటూ అప్ప‌ట్లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు పూన‌మ్.

అదంతా గ‌తం అనుకుంటే .. ఇటీవ‌ల పూన‌మ్ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ఉంటున్నారు. లేటెస్టుగా పూన‌మ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. త‌న నెక్ దిగువ‌గా ఛాతీ భాగంపై త్రిశూలాన్ని నాగుపామును ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్న ఫోటోలు యూత్ లో హాట్ టాపిక్ గా మారాయి.