Begin typing your search above and press return to search.
న్యాయవాదిగా పోరాడాలనుకున్నా.. కానీ ఏది నెరవేరలేదు : హీరోయిన్
By: Tupaki Desk | 26 Nov 2020 11:20 PM ISTసినిమాలతో కంటే వివాదాలతో గుర్తింపు పొందిన హీరోయిన్ పూనమ్ కౌర్. 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్.. 'ఒక విచిత్రం' 'గగనం' 'శౌర్యం' 'నాగవల్లి' 'అటాక్' 'శ్రీనివాస కళ్యాణం' వంటి సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా అమ్మడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి 'స్వర్ణ ఖడ్గం' అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధం లేని అంశాలపై స్పందిస్తూ వార్తల్లో ఉంటుంది పూనమ్. సమకాలీన సినీ రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. తనపైన నెగిటివ్ కామెంట్స్ చేసే వారిపైన రియాక్ట్ అవుతూ ఉంటుంది.
ఆ మధ్య టాలీవుడ్ లో గురూజీ అని పిలవబడే ఓ స్టార్ డైరెక్టర్ వలన తన జీవితం నాశనం అయిందని.. అతని వల్ల డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయని ట్వీట్ చేసి సంచలనం రేపింది. అతను మీడియాను నియంత్రిస్తాడని.. మూవీ మాఫియాను ఆయనే శాసిస్తాడని.. అడ్వర్టైజ్‌మెంట్స్ ఆయన చెబితేనే ఇస్తారని ఆ డైరెక్టర్ గురించి అనేక విషయాలు వెల్లడించింది పూనమ్. ఈ క్రమంలో తాజాగా తన డ్రీమ్ గురించి చెబుతూ ఓ ట్వీట్ చేసింది.
పూనమ్ కౌర్ ఈ రోజు జాతీయ న్యాయ దినోత్సవమని చెబుతూ.. 'నేను ఓ న్యాయవాదిని అయి ఎంతో పోరాడుదామని అనుకున్నాను.. కానీ ఏది నెరవేరలేదు.. ఎందుకంటే విధికి తెలుసు ఏం చేయాలో.. అది ఏమనుకుంటే అదే జరుగుతుంద'ని ట్వీట్ తో చెప్పుకొచ్చింది. లాయర్ అవుదామనుకున్న పూనమ్.. నటి అయినందుకు నిరాశలో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.