Begin typing your search above and press return to search.

‘అతను ఒక రాజకీయ నేరగాడు’.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

By:  Tupaki Desk   |   5 Sept 2021 4:41 PM IST
‘అతను ఒక రాజకీయ నేరగాడు’.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
X
టాలీవుడ్ లో చేసినవి కొద్ది సినిమాలే అయినా ఒక స్టార్ హీరోతో ముడిపెట్టుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. సమాజంలో జరుగుతోన్న అంశాలపై తనదైన రీతిలో నటించే ఈ నటి చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి.

తాజాగా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంపై వివాదాస్పద ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఇదిప్పుడు సంచలనమైంది. పూనమ్ కౌర్ తాజాగా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పలు అనుమానాలుకు తావిస్తోంది.

పలు స్క్రీన్ షాట్ లను పోస్ట్ చేసిన పూనమ్.. 'అతడు ఓ దళితుడికి గుండు కొట్టించాడు. ఐఏఎస్ అధికారుల ఫోన్లను హ్యాక్ చేశాడు. వాట్సాప్ లో అసత్యపు కథనాలు, సందేశాలను ఫార్వర్డ్ చేశాడు. అతను రాజకీయ నేరగాడు కూడా అయ్యిండొచ్చు. అతను చేసిన కొన్ని మెసేజ్ లు, లేటర్స్ సేఫ్టీ కోసం పోస్ట్ చేస్తున్నాను' అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది పూనమ్ కౌర్. దీంతో ఎవరా వ్యక్తి అన్నది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది

పూనమ్ చేసిన పోస్ట్ ఆధారంగా అతడు బిగ్ బాస్ సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ, రాజకీయ ప్రముఖుడిగా ఎదిగిన వ్యక్తి అని అర్థమవుతోంది. ఓ దళితుడికి అప్పట్లో ఆ బిగ్ బాస్ ఫేమ్ గుండుకొట్టించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పూనమ్ కౌర్ ఆ బిగ్ బాస్ ఫేమ్ పై ఇలా ట్వీట్ చేసి వివాదానికి దారితీసిందని తెలుస్తోంది.

https://twitter.com/poonamkaurlal/status/1434035960975556610?s=20