Begin typing your search above and press return to search.

బావ సినిమ‌కొచ్చాను అక్క! రివ్యూ నిజాయితీగా కావాలి

By:  Tupaki Desk   |   25 Feb 2022 11:38 AM GMT
బావ సినిమ‌కొచ్చాను అక్క! రివ్యూ నిజాయితీగా కావాలి
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..టాలీవుడ్ హంక్ రానా ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన `భీమ్లా నాయ‌క్` నేడు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అభిమానుల్లో `భీమ్లా నాయ‌క్` ఫీవ‌ర్ కొన‌సాగుతుంది. పాజిటివ్ రివ్యూలు...మంచి మౌత్ టాక్ తో `భీమ్లా నాయ‌క్` బ్లాక్ బ‌స్ట‌ర్ గా మారిపోయింది. ప‌వ‌న్ మేనియా మ‌రోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసేలా క‌నిపిస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోల‌కు అనుమ‌తిలేక‌పోయినా ప‌వ‌న్ అభిమానులు సినిమాను త‌మ భుజ‌స్కందాల పై వేసుకుని మోస్తున్నారు. అందుకు జ‌న‌సేన సైన్యం ముందుండి ప‌నిచేస్తుంది.

పాత టిక్కెట్ ధ‌ర‌ల‌తో `బీమ్లా నాయ‌క్` బాక్సాఫీస్ వ‌ద్ద రారాజుగా నిలుస్తాడ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్-రానా కాంబినేష‌న్ కి స‌రైన క‌మ‌ర్శియ‌ల్ హిట్ ప‌డింద‌ని టాక్ వినిపిస్తోంది. ప‌వ‌న్ -రానా యాక్ష‌న్ స‌న్నివేశాలు..త్రివిక్ర‌మ్ పంచ్ ప‌వ‌ర్.. థ‌మ‌న్ సంగీతం తో `భీమ్లా నాయ‌క్` థియేట‌ర్లు షేక్ అవుతున్నాయి. నాలుగైదు రోజుల పాటు థియేట‌ర్ వ‌ద్ద భీమ్లా ఫీవ‌న్ కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇలా ప‌వ‌న్ అభిమానులంతా ఎంతో సంతోషంగా `భీమ్లా నాయ‌క్` పండుగ జ‌రుపుకుంటున్నారు. అయితే ఇప్పుడా సంతోషాల‌పై నెట్టింట నీళ్లు చ‌ల్లే ప్ర‌య‌త్నం చేసింది పూన‌మ్ కౌర్.

ఓ స్ర్కీన్ షాట్ ని షేర్ చేసి మ‌రోసారి నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ పూన‌మ్ అంత‌గా ఏంచేసింద‌ని? అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. `బావ సినిమాకి వ‌చ్చాను అక్కా` అని ఎవ‌రో ఆమెతో చాట్ చేసిన స్ర్కీన్ షాట్ ల‌ను పంచుకుంది.

అందులో నిజాయితీ గ‌ల రివ్యూ కావాల‌ని పూన‌మ్ అడిగిన‌ట్లు ఉంది. దానికి ఆమె కూడా ఒకే చెప్పింది. మ‌రి ఇక్క‌డ బావ ఎవ‌రు? ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన‌ట్లా? రానాని ఉ ద్దేశించిన‌ట్లా? అన్న‌ది క్లారిటీ లేదు. ఇక పూన‌మ్ కౌర్ వివాదం గురించి తెలిసిందే. గ‌తంలో పూన‌మ్ కౌర్ ఓ స్టార్ హీరోని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు మీడియాలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ పూన‌మ్ కొన్నాళ్ల పాటు సైలెంట్ గానే ఉంది. మ‌ళ్లీ కొంత గ్యాప్ త‌ర్వాత‌..అదీ ప‌వ‌న్ కళ్యాణ్-రానా న‌టించిన `భీమ్లానాయ‌క్` రిలీజ్ డే రోజున షేర్ చేసిన స్ర్కీన్ షాట్ నెట్టింట వైర‌ల్ గా మారాడం సంచ‌ల‌నంగా మారింది. ఇక న‌టిగా పూనమ్ కౌర్ కి పెద్ద‌గా అవ‌కాశాలు రాని సంగ‌తి తెలిసింది.

కోలీవుడ్ లో ఆమె చివ‌రి సారిగా మూడేళ్ల క్రితం `గెస్ట్` అనే సినిమాలో న‌టించింది. అంత‌కు ముందు తెలుగులో `నెక్స్ట్ ఏంటి` అనే చిత్రంలోనూ క‌నిపించింది. ఆ త‌ర్వాత పూర్తిగా వెండి తెర‌కు దూర‌మైంది. మీడియాలో ఓ స్టార్ హీరోపై చేసిన వ్యాఖ్య‌ల‌తోనే ఆమె మ‌ళ్లీ ఫేమ‌స్ అయింది.