Begin typing your search above and press return to search.

ఖాళీగా ఉందిగా, ఈ రోల్‌ ఇచ్చారులే

By:  Tupaki Desk   |   13 July 2015 11:59 PM IST
ఖాళీగా ఉందిగా, ఈ రోల్‌ ఇచ్చారులే
X
అందానికి అందం, హాట్‌ అప్పియరెన్స్‌ పూనమ్‌ కౌర్‌ ప్రత్యేకత. 2006 మిస్‌ ఆంధ్రా, 2011లో మిస్‌ ఇండియా సౌత్‌ కిరీటాలు దక్కించుకుని టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. వినాయకుడు, గగనం వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. అయితే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది. దాంతో పొరుగు భాషల్లో కొత్తగా ప్రయత్నాలు ప్రారంభించింది. తమిళ్‌, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో అడపాదడపా నటించి అక్కడివారి మెప్పు పొందింది.

అయితే ఓ తెలుగమ్మాయికి తెలుగు సినిమాల్లో ప్రోత్సాహం దక్కకపోవడం నిరాశపరిచేదే. కానీ అనూహ్యంగా ఇప్పుడు పూనమ్‌ పేరు పొలిటికల్‌ సర్కిల్స్‌, సినిమా సర్కిల్స్‌లో మార్మోగిపోతోంది. అందాల రాణిగా రాని గుర్తింపు ఈ అమ్మడికి 'మిస్‌ తెలంగాణ' కాన్సెప్టు వల్ల వచ్చింది. త్వరలో జరగనున్న మిస్‌ తెలంగాణ ఈవెంట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పూనమ్‌ బాధ్యతల్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ నుంచి వచ్చిన మిస్‌ ఆంధ్రా.. ఇప్పుడు మిస్‌ తెలంగాణ సెలక్షన్స్‌లో కీలక పాత్ర పోషించబోతోంది. ఎలాగూ కెరీర్‌ పరంగా ఒరగబెట్టిందేం లేదు. ఏ పనీ లేకుండా ఖాళీగానే ఉంది కాబట్టి ఇదే కరెక్ట్‌.