Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ముద్దొచ్చేస్తున్న బంతిపూల జాన‌కి

By:  Tupaki Desk   |   19 Sep 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: ముద్దొచ్చేస్తున్న బంతిపూల జాన‌కి
X
అందాల క‌థానాయిక‌ల ప్ర‌యోగాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూ నెటిజ‌నుల కంటికి కునుకు క‌రువ‌య్యేలా చేస్తున్నారు. తాజాగా బొద్దుగుమ్మ పూన‌మ్ బ‌జ్వా ఇదే తీరుగా ట్రెండీ ఫోటోషూట్ తో కుర్రాళ్ల మ‌న‌సు మందిరంలోకి బంతి పువ్వు విసిరారు.

నేటిత‌రం నాయిక‌లు సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా టచ్ లో వుంటున్నారు. గ్లామ‌ర్ ని తెర‌పరిచేస్తూ నెటిజ‌నుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో నిత్యం నెట్టింట సంద‌డి చేస్తున్నారు. కింగ్ నాగ్ హీరోయిన్ కూడా గ‌త కొంత కాలంగా ఇదే ఫార్ములాని పాటిస్తూ నెటిజ‌న్స్ ని ఓ ఆట ఆడించేస్తోంది. హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో సోష‌ల్ మీడియాని హీటెక్కించేస్తోంది.

న‌వ‌దీప్ న‌టించిన `మొద‌టి సినిమా`తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన‌ ఈ ముంబై చిన్న‌ది ఆ త‌రువాత కింగ్ నాగార్జున‌ న‌టించిన `బాస్‌` చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఆవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక‌పోయింది. ఆ త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీ బాట ప‌ట్టిన పూన‌మ్ అక్క‌డే న‌టిగా స్థిర‌ప‌డిపోయింది. పాపుల‌ర్‌ డ్యాన్స్ మాస్ట‌ర్ బాబా భాస్క‌ర్ తొలిసారి డైరెక్ట్ చేసిన `కుప్పాత్తురాజా` చిత్రంలో యువ సంగీత ద‌ర్శ‌కుడు జీవి ప్ర‌కాష్ కుమార్ కు జోడీగా న‌టించింది.

వీరిద్ద‌రి మ‌ధ్య చిత్రీక‌రించిన హాట్ హాట్ స‌న్నివేశాలు యువ‌త‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. త‌మిళ‌- మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్న పూన‌మ్ భ‌జ్వా క‌మ‌ర్ష‌య‌ల్ యాడ్స్ లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుకుంటోంది. క్రేజీ నాయిక‌గా గుర్తింపుని ద‌క్కించుకోలేక‌పోయినా క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అల్లాన్స్ వేర్స్ బ్రాండ్ కోసం స‌న్యాసినిగా పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో మెడ‌లో రుద్రాక్ష,.. బంతిపూల మాల ధ‌రించి హొయ‌లు పోతున్న పోస్ట్ చేసిన పూన‌మ్ భ‌జ్వా ఈ గెట‌ప్ అల్లాన్స్ వేర్స్ యాడ్ షూట్ కోసం అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది.