Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : హాట్‌ బ్యూటీ టాప్ యాంగిల్‌ క్లిక్‌ అదుర్స్‌

By:  Tupaki Desk   |   2 Oct 2021 2:30 AM GMT
ఫొటోటాక్ : హాట్‌ బ్యూటీ టాప్ యాంగిల్‌ క్లిక్‌ అదుర్స్‌
X
నవదీప్ హీరోగా నటించిన 'మొదటి సినిమా' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వ. మొదటి సినిమా నిరాశ పర్చడంతో తెలుగు లో ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కలేదు. ముద్దుగుమ్మ పూనమ్‌ తెలుగు లో అడపా దడపా వస్తున్న ఆఫర్లతో కెరీర్‌ ను నెట్టుకు వచ్చింది. నాగార్జున వంటి స్టార్‌ హీరోతో బాస్ సినిమాలో నటించింది. కాని ఆ సినిమా కూడా ఈ అమ్మడికి నిరాశ పర్చింది. సినిమాలో హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈ అమ్మడు చేస్తూ కెరీర్‌ లో ముందుకు వెళ్తుంది. హీరోయిన్‌ గా ఇతర భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం.. తమిళం కన్నడంలో కూడా ఈమె సినిమాలు చేసింది. అన్ని చోట్ల కూడా అంతంత మాత్రంగానే గుర్తింపు దక్కించుకుంది. సినిమాల్లో సక్సెస్ లు లేకున్నా కూడా ఇంకా ఈ అమ్మడిని గుర్తు పెట్టుకోవడానికి కారణం ఈ అమ్మడి ఫొటో షూట్స్.

రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటో షూట్స్ లేదా ఇంట్రెస్టింగ్ సెల్ఫీలను షేర్ చేస్తూ ఉంటుంది. నెట్టింట ఆ ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి హాట్ ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. టాప్ యాంగిల్ లో తీసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. మినీ స్కర్ట్‌ ను వేసిన ఈ అమ్మడు టాప్ యాంగిల్ ద్వారా క్లీ వేజ్ షో చేస్తూ ఉన్న ఫొటోను చూసి నెటిజన్స్ ఈ అమ్మడు ఇంకా కూడా మంచి పిజిక్ మరియు అందంను కలిగి ఉంది. మంచి ఆఫర్లు వస్తే ఖచ్చితంగా అవకాశంను వినియోగించుకునేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో ఈమె చివరగా నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' లో కనిపించింది. ఆ సినిమాలో కొన్ని నిమిషాల పాత్ర మాత్రమే. మలయాళం మరియు తమిళంలో అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. 36 ఏళ్ల ఈ అమ్మడు మళ్లీ ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్‌ ఇన్నింగ్స్ ను ఆరంభించాలని ఆశిస్తుంది. మరి ఈ అమ్మడి ఫొటో షూట్స్ ను హాట్ ఫొటోలను మన మేకర్స్ చూసి వారి కంట పడితే ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే ఈ అమ్మడు అప్పటి కంటే ఇప్పుడు అందంగా కనిపించడంతో పాటు ఇంకా కూడా పాతికేళ్ల పడుచు అన్నట్లుగానే ఉంది. అందుకే ఈమెకు ఇండస్ట్రీ మళ్లీ ఆఫర్లు ఇస్తుందా అనేది ఆసక్తికర విషయం. అవకాశం వస్తే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని పూనం బజ్వ తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తోంది.