Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః ఇంకా ఎందుకు ఈ అందాల ఆరబోత అమ్మడు?

By:  Tupaki Desk   |   9 April 2021 9:30 AM GMT
ఫొటోటాక్‌ః ఇంకా ఎందుకు ఈ అందాల ఆరబోత అమ్మడు?
X
నవదీప్‌ హీరోగా నటించిన 'మొదటి సినిమా' అనే చిత్రంతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్‌ భజ్వా. ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు అయితే దక్కించుకుంది కాని కమర్షియల్‌ హీరోయిన్‌ గా మాత్రం పేరు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు దాటిన ఈ అమ్మడు ఇంకా ఆఫర్ల కోసం ఆరాటపడుతూనే ఉంది. తెలుగులో ఈ అమ్మడు చివరగా ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాలో ఒక చిన్న పాత్రను చేసిన విషయం తెల్సిందే. మళ్లీ తెలుగులో ఈమెకు ఆఫర్లు ఏమీ రాలేదు. తమిళం మరియు మలయాళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది.

సినిమాల్లో అవకాశాలు లేకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడి అందాల ఆరబోత విషయం హాట్‌ టాపిక్ గానే ఉంది. అంచనాలను మించి అన్నట్లుగా ఈ అమ్మడి ఆందాల ఆరబోత ఉంటుంది. సాదారణంగా అయితే సినిమాల్లో ఆఫర్ల కోసం ఇలా అందాల ప్రదర్శణ ఫొటో షూట్‌ లు షేర్‌ చేస్తూ ఉంటారు. పూనమ్‌ భజ్వా కెరీర్‌ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం లేదు. అయినా కూడా ఎందుకు ఇంతగా హాట్‌ ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం మీరు సినిమాల్లో ఆకట్టుకోలేక పోయినా ఇలా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలతో సూపర్ హిట్‌ అవుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి జోరు చూస్తుంటే మళ్లీ ఆఫర్లు దక్కించుకునే వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటుందనిపిస్తుంది.