Begin typing your search above and press return to search.

డాల్ఫిన్ లా ల‌క్ష ఎటెంప్ట్ లు చేసిన పూన‌మ్!

By:  Tupaki Desk   |   29 Jan 2021 2:00 PM IST
డాల్ఫిన్ లా ల‌క్ష ఎటెంప్ట్ లు చేసిన పూన‌మ్!
X
సోష‌ల్ మీడియాల్లో సాటి నాయిక‌ల‌కు ఏమాత్రం తీసిపోవ‌డం లేదు పూన‌మ్ బ‌జ్వా. గ‌త కొంత‌కాలంగా వ‌రుస ఫోటోషూట్ల‌తో అంత‌కంత‌కు హీట్ పెంచేస్తోంది. ముఖ్యంగా హాట్ యోగా భంగిమ‌ల్ని అభిమానుల‌కు షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది.

తాజాగా వీర‌భ‌ద్రాస‌న‌ను ప‌రిచ‌యం చేసింది. ఇది డాల్ఫిన్ త‌ర‌హాలో వంగి క‌నిపించే భంగిమ‌. ఈ భంగిమ‌ను ల‌క్ష సార్లు ఎటెంప్ట్ చేసింద‌ట‌. ఆ విష‌యాన్ని చెబుతూ తాజా యోగాస‌న ఫోటోని పూన‌మ్ బ‌జ్వా షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. యోగాను ఒక యుద్ధంలా భావించి ధీక్ష‌గా చేస్తున్నాన‌ని తెలిపింది.

పూన‌మ్ బ‌జ్వా.. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్.. తెలుగులో నాగార్జున లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిన‌దే. 2019లో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో న‌టించిన పూన‌మ్ జీవీ ప్ర‌కాష్ స‌ర‌స‌న ఓ హాటెస్ట్ ల‌వ్ స్టోరీలోనూ న‌టించింది. త‌మిళ- కన్నడ ప‌రిశ్ర‌మ‌లోనూ ఈ భామ‌ సుప‌రిచితం. అయితే ఇటీవ‌ల ఆశించినంత‌గా కెరీర్ ప‌రంగా జోరు క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాల్లోనూ పూన‌మ్ అసాధార‌ణంగా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. ఇన్ స్టా వేదిక‌పై రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ భారీగా అనుచ‌రుల్ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.