Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 4'లో నాగ్ హీరోయిన్...?

By:  Tupaki Desk   |   24 July 2020 9:50 AM GMT
బిగ్ బాస్ 4లో నాగ్ హీరోయిన్...?
X
ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్ లో 'బిగ్ బాస్' ఒకటని చెప్పవచ్చు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలైన రియాలిటీ షో మజాని పరిచయం చేసింది 'బిగ్ బాస్' కార్యక్రమం. ఈ షోకు ఫస్ట్ సీజన్‌ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై ఎన్నో విమర్శలు వివాదాలు కూడా చెలరేగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ఇప్పుడు సీజన్ 4 కి సిద్ధం అవుతోంది. బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన ఈ రియాలిటీ షోలో పాల్గొనడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో 'బిగ్ బాస్' సీజన్ 4 కోసం ఇప్పటికే ఇండ‌స్ట్రీలో ప్రముఖులను సంప్రదిస్తున్నారు నిర్వాహకులు. ఇక ఇప్పటికే 'బిగ్ బాస్ 4'లో పాల్గొనే వారు వీరేనంటూ పలువురు సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ షో కోసం సన్నాహకాలు చేస్తున్న 'స్టార్ మా' వారు ఆగష్టు 30న సీజన్ 4 ప్రారంభించనున్నారు. ఇప్పటికే 'బిగ్ బాస్ 4'కి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు.

ఇదిలా ఉండగా ఈసారి 'బిగ్ బాస్'కి మరింత గ్లామర్ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్న నిర్వాహకులు హాట్ గర్ల్స్ ని హౌస్ లోకి పంపించనున్నారట. ఈ నేపథ్యంలో గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వాని రంగంలోకి దింపుతున్నారట. 'మొదటి సినిమా'తో వెండితెరకు పరిచయమైన అందాల భామ పూనమ్ బజ్వా.. కింగ్ నాగార్జున సరసన 'బాస్‌' సినిమాలో నటించింది. 'పరుగు' 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసిన పూనమ్ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే తమిళ మలయాళ కన్నడ ఇండస్ట్రీలలో మాత్రం తన బొద్దు అందాలతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఈ క్రమంలో పూనమ్ భజ్వా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే హౌస్ కే స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుందని చెప్పవచ్చు. ఇక ఈ షోలో పాల్గొనటానికి ఈ బ్యూటీకి దాదాపు 45 లక్షలు రెమ్యూనిరేషన్ గా ఇస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.