Begin typing your search above and press return to search.

అన్నీ పుకార్లే అంటావా పూనమ్!?

By:  Tupaki Desk   |   1 Aug 2016 7:14 AM GMT
అన్నీ పుకార్లే అంటావా పూనమ్!?
X
పూనమ్ బజ్వా అని ఒక హీరోయిన్ ఉండేది. మొదటి సినిమా అంటూ తెలుగు మూవీతో మొదలుపెట్టి.. ఇంకా హీరోయిన్ గానే కంటిన్యూ అవుతున్నా ఉండేది అని ఎందుకనాలంటే.. ఈ భామ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి నాలుగేళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో పరుగులో ఓ కేరక్టర్ తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ తమిళ్ - మలయాళం - కన్నడ సినిమాల్లో మాత్రం కంటిన్యూ అవుతోంది.

ఈ పంజాబీ భామపై కొన్ని నెలల క్రితం బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. సాయి ధరం తేజ్ తో తిక్క మూవీ తీసిన డైరెక్టర్ సునీల్ రెడ్డితో ఈమెకు అఫైర్ ఉందని.. అప్పట్లో పెళ్లి కూడా చేసేసుకుందని టాక్. వాటిని పూనం బజ్వా అప్పట్లో గట్టిగానే ఖండించింది. మూడు నెలల క్రితం ఆ విషయం మనం కూడా చెప్పుకున్నాం. తీరా సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తిక్క మూవీ ఫంక్షన్ కి పూనమ్ అటెండ్ అయింది. సినిమా ఫంక్షన్ కాబట్టి ఎవరైనా పిలవచ్చు.. ఎవరినైనా పిలవచ్చు.. అందులో మాట్లాడుకోడాలు ఉండవ్. అయితే.. ఈమె ఎంచక్కా స్టేజ్ ఎక్కేసింది.

ఆడియో ఫంక్షన్ జరుగుతున్న టైమ్ లో సునీల్ రెడ్డికి సన్నిహితంగానే ఉంది. ఆ తర్వాత కూడా స్టేజ్ పై సునీల్ కి క్లోజ్ గానే కనిపించించింది. ఆల్రెడీ అఫైర్ అనే మాటలు వినిపిస్తున్నపుడు.. జస్ట్ గెస్ట్ గా వస్తే కింద కూచోవచ్చు కదా? ఇలా స్టేజ్ పైకెక్కి పక్కనే కనిపించాక కూడా.. ఇంకా అన్నీ పుకార్లే అంటావా పూనమ్ బజ్వా!?