Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ స్టోరి: పూల్ సైడ్ వాట‌ర్ బేబీస్ తుంట‌రి వేషాలు

By:  Tupaki Desk   |   23 April 2022 12:30 AM GMT
స్పెష‌ల్ స్టోరి: పూల్ సైడ్ వాట‌ర్ బేబీస్ తుంట‌రి వేషాలు
X
నార్త్ సౌత్ అనే విభేధం లేకుండా అన్నిచోట్లా వేవ్స్ క్రియేట్ చేస్తున్న న‌లుగురు ముద్దుగుమ్మ‌లు కుర్ర‌కారుకు స‌మ్మ‌ర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు. వాట‌ర్ బేబీస్ గా పూల్ సైడ్ ట్రీట్ తో క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ట్రీటిస్తున్నారు. ఇంత‌కీ ఎవ‌రా ముద్దుగుమ్మ‌లు.. అంటే? ఇలియానా-రష్మిక మందన్న- అనన్య పాండే- సోనాల్ చౌహాన్.. వాటర్ బేబీలుగా గుండెల్లో హీట్ పెంచారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌ల పూల్ సైడ్ ట్రీట్ గురించి ప‌రిశీలిస్తే.. ఇవిగో ఈ ఫోటోలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

వేసవి మంట‌లు పెట్టేస్తుంటే పూల్స్ వెతుకుతున్నారు అందాల క‌థానాయిక‌లు. వేడిని తట్టుకునేందుకు బాలీవుడ్ దివాస్ వాటర్ బేబీలుగా మారుతున్నారు. ప‌నిలో ప‌నిగా బికినీ ల‌తో దుమారం రేపేందుకు.. బహుశా ఉత్తమ సమయమిద‌ని భావిస్తున్నారు. రష్మిక మందన్న నుండి అనన్య పాండే వరకు.. వెట‌ర‌న్స్ లో ఇలియానా -సోనాల్ సైతం ఈ త‌ర‌హా ట్రీటిస్తున్నారు. భామ‌లంతా మేజర్ పూల్ గోల్స్ ఇస్తున్నారు.

రష్మిక మందన్న రిఫ్రెష్ అయ్యేందుకు ఈత కోసం కొలనులోకి దూకింది. కానీ ఒంటి కాలిపై దూకింది. అయితే నీటిలో ఈత రాని చేప పిల్ల‌లా ఎలా బేల‌గా క‌నిపిస్తోందా క‌దా?

అనన్య పాండే టినీ బికినీలో ఒదిగిపోయి ఎంతో తాధాత్మ్యంతో తన అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. ప్ర‌స్తుతం ఈ బికినీ ఫోటోగ్రాఫ్స్ ని లైగ‌ర్ ఫ్యాన్స్ వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

ఇలియానా డి క్రజ్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ నుంచి దూర‌మైనా కానీ త‌న ఆస‌క్తుల‌ను వ‌దులుకోలేదు. ఈ బ్యూటీ కూడా తన సంతోషకరమైన పూల్ సైడ్ ట్రీట్ పై ఫోటోల‌ను షేర్ చేసింది. టోన్డ్ బాడీని టాన్ తో మింగిల్ చేయ‌డం ఇలియానా ప్ర‌త్యేక‌త అని పదే ప‌దే ప్రూవ్ చేస్తోంది.

దిశా పటాని అగ్గి రాజేసే ఏ ఒక్క అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌దు. కొన్ని రోజుల క్రితం దిశా పటానీ ఈ బికినీ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయ‌గా అంత‌ర్జాలంలో దుమారం రేపింది. తన హాట్ నెస్ తో ఇంటర్నెట్ ను బ్రేక్ చేసింది.

సోనాల్ చౌహాన్ తన బీచ్ వాకేలో బంచ్ ఆఫ్ ఫ‌టోగ్రాఫ్స్ తో విరుచుకుప‌డింది. బికినీలో సోనాల్ ఎప్పుడూ నిరాశపరచదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఎఫ్ 3తో పాటు ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. ప్ర‌తిసారీ బికినీలో అల‌రించేందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ట‌.

మిలింద్ సోమన్ భార్య అంకితా కొన్వార్ తన బీచ్ హాలిడే నుండి త్రోబాక్ ఫోటోని పంచుకోవడం ద్వారా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. భామ‌లంతా బికినీ ఫెస్టివ‌ల్స్ లో బిజీ గా ఉన్నారు. వాట‌ర్ బేబీస్ గా రికార్డులు తిర‌గ‌రాయాల‌న్న కసితో ఉన్నారు. ఇక వీళ్ల‌కు తోడు సారా అలీఖాన్ - జాన్వీ క‌పూర్- కియ‌రా అద్వాణీ- అన‌న్య పాండే త‌దిత‌ర హాట్ గాళ్స్ కూడా ఇటీవ‌ల తాము కూడా వాట‌ర్ బేబీస్ అని నిరూపించారు.