Begin typing your search above and press return to search.
మన పూజితకు కూడా అదే పరిస్థితి?
By: Tupaki Desk | 17 March 2020 3:15 PM ISTవైజాగ్ అమ్మాయి పూజిత పొన్నాడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా అనుకోని అవకాశంగా వచ్చిన షార్ట్ ఫిల్మ్ లో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ వెంటనే సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చాయి. దర్శకుడు అనే చిత్రంతో సుకుమార్ బ్యానర్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన పూజిత ‘రంగస్థలం’ చిత్రంలో కీలక పాత్రను పోషించింది. తెలుగమ్మాయి అవ్వడం వల్ల పూజితకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదనే టాక్ వినిపిస్తుంది.
ఈమద్య కాలంలో తెలుగు అమ్మాయిలు ఎవరు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా పేరు దక్కించుకోలేక పోయారు. చేసినా కూడా చిన్నా చితకా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అందులో మంచి గుర్తింపును దక్కించుకున్నా కూడా పెద్ద హీరోలు తెలుగు అమ్మాయిలను పట్టించుకోరు. అందాల ఆరబోత విషయంలో ముంబయి ముద్దుగుమ్మలతో పోటీ పడ్డా కూడా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ముఖ్యంగా స్టార్స్ తో సినిమాలు చేసే మేకర్స్ వీరిని దూరం పెడతారు. పూజా పొన్నాడ పరిస్థితి కూడా అలాగే ఉంది.
తెలుగులో చిన్న సినిమాలు వరుసగా చేస్తున్నా కూడా పెద్ద సినిమాల్లో ఛాన్స్ రావడం లేదు. ఇదే సమయంలో ఈమె తమిళంలో కూడా బిజీ అవుతుంది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేసి వాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆ సినిమాలు విడుదలైతే తమిళంలో ఈమెకు స్టార్స్ సినిమాలో ఛాన్స్ వస్తాయని ఆశపడుతోంది.
తెలుగులో సుకుమార్.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఆశపడుతోంది. వారి సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. కాని వారి సినిమాల్లో ఈమెకు అవకాశాలు రావడం అది కూడా మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ రావడం కష్టమే అంటూ నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని పూజితకు ఉన్న ట్యాలెంట్ తో తమిళంలో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందని నమ్మకం గా ఉన్నారు.