Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : తెలుగు అమ్మాయిని టాలెంట్ గుర్తించాల్సిందే..!

By:  Tupaki Desk   |   8 Jan 2023 12:30 PM GMT
ఫోటో స్టోరీ : తెలుగు అమ్మాయిని టాలెంట్ గుర్తించాల్సిందే..!
X
టాలీవుడ్ లో సైడ్ రోల్స్ తో పాటుగా చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మెప్పిస్తున్న భామ పూజిత పొన్నాడ. తెలుగు అమ్మాయి అయిన పూజిత రంగస్థలం లో ఆది పినిశెట్టి లవర్ గా కనిపించి అలరించింది. అందం, అభినయం ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. ఆమె చేస్తున్న సినిమాలేవి ఆడియన్స్ కి పెద్దగా రిజిస్టర్ అవ్వట్లేదు. వచ్చిన అర కొర అవకాశాలనే చేస్తూ కెరీర్ వెళ్లదీస్తుంది అమ్మడు.

సినిమాల కన్నా ఫోటో షూట్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది పూజిత. అందుకే అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. తరచూ తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది పూజిత. అయితే తన గ్లామర్ సైడ్ కన్నా తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు బీచ్ లో శారీ లుక్ లో ఫోటో షూట్ చేసింది. అది చూసిన కుర్రాళ్లు పూజిత నా హృదయ దేవత నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ కలర్ శారీలో వావ్ అనిపించేలా అమ్మడి అందాలు కేక పెట్టిస్తున్నాయి.

సరైన ఛాన్స్ వస్తే చాలు తన టాలెంట్ ఏంటో చూపించాలని చూస్తున్న పూజిత పొన్నాడకి అలాంటి అవకాశం రావట్లేదని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన పూజిత ఆకాశ వీధుల్లో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం రవితేజ రావణాసుర తో పాటుగా తమిళంలో భగవాన్ సినిమా చేస్తుంది పూజిత.

తెలుగు అమ్మాయి కదా గ్లామర్ విషయంలో అడ్డు చెబుతుందేమో అనుకుంటే తను చేస్తున్న సినిమాల్లో లిప్ లాక్స్ ఇస్తూ ఫుల్ కోపరేట్ చేస్తుంది పూజిత. అలాంటిది స్టార్ ఛాన్స్ వస్తే రెచ్చిపోకుండా ఉంటుందా చెప్పండి. కానీ అలాంటి ఛాన్స్ ఒకటి ఇచ్చి ఆమెను ఎంకరేజ్ చేస్తే మాత్రం పూజిత నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. తప్పకుండా అమ్మడికి ఫ్యూచర్ లో అయినా అలాంటి ఛాన్స్ వచ్చి కెరీర్ లో దూసుకెళ్లాలని ఆశిద్దాం.