Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ కోసం పెద్ద ఆఫ‌ర్లు కాదంది!

By:  Tupaki Desk   |   18 Jun 2022 4:32 AM GMT
పాన్ ఇండియా స్టార్ కోసం పెద్ద ఆఫ‌ర్లు కాదంది!
X
కొన్ని వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు.. అటుపై కొన్ని వ‌రుస‌ ప‌రాజ‌యాలు.. అయినా ముంబై బ్యూటీ పూజా హెగ్డే కెరీర్ కి వ‌చ్చిన డోఖా ఏమీ లేదు. తెలుగు నాట బుట్ట‌బొమ్మ‌గా పాపుల‌రైన ఈ బ్యూటీకి ఒకే ఏడాదిలో రాధేశ్యామ్- బీస్ట్ లాంటి బిగ్ ఫ్లాప్ లు ఎదురైనా ఇప్ప‌టికీ డిమాండ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇటీవ‌ల ప‌లువురు టాలీవుడ్ అగ్ర‌హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు ఇచ్చినా పూజా ఎందుక‌నో సంత‌కాలు చేసేందుకు నిరాక‌రించింది.

దీంతో ఇక పూజా తెలుగులో న‌టించ‌ద‌ని బాలీవుడ్ కి వెళ్లిపోతోంద‌ని కూడా ప్ర‌చార‌మైంది. స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న కభీ ఈద్ కభీ దీపావళి తో పాటు ప‌లువురు హిందీ అగ్ర‌హీరోల చిత్రాల‌కు సంత‌కాలు చేయ‌డంతో ఈ డౌట్ వ్య‌క్త‌మైంది.

తెలుగులో ఈ భామ పూరి 'జ‌న‌గ‌ణ‌మ‌న'లో న‌టిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. త‌దుప‌రి మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ లోనూ న‌టించాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గానే పూజా హెగ్డే క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ బ్యూటీ అక్క‌డ కేజీఎఫ్ రాఖీభాయ్ య‌ష్ తో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. ఈ చిత్రానికి నార్ట‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

నిజానికి పూజా తెలుగులో కొన్ని పెద్ద ఆఫర్ల‌ను కాద‌నుకుని య‌ష్ సినిమాకే సంత‌కం చేయ‌డానికి కార‌ణ‌మేమిటా? అంటూ విశ్లేషిస్తున్నారు. రాకింగ్ స్టార్ య‌ష్ కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో సంచ‌ల‌న విజ‌యాలు అందుకుని పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతుండ‌డమే దీనికి కార‌ణం.

పూజా ఎంతో తెలివిగా గేమ్ ని ఛేంజ్ చేసింది. పాన్ ఇండియా స్టార్ కోస‌మే తెలుగులో పెద్ద ఆఫ‌ర్లు కాద‌నుకుంది! అంటూ గుస‌గుస ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. ప్రస్తుతం పూజా జనగణమన- కభీ ఈద్ కభీ దీపావళి చిత్రీకరణల‌తో బిజీగా ఉన్న పూజా ముంబై టు హైద‌రాబాద్ నిరంత‌ర ప్ర‌యాణాలు సాగిస్తోంది.