Begin typing your search above and press return to search.
కరోనా నుండి బయటపడిన ప్రభాస్ హీరోయిన్..!
By: Tupaki Desk | 5 May 2021 8:06 PM ISTసౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అయితే ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ భామ.. ఏప్రిల్ చివరి వారంలో కరోనా మహమ్మారి సోకి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళింది. సూపర్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నటువంటి పూజా.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనే చెప్పాలి. అందుకే అమ్మడి కోసం స్టార్ హీరోలు మేకర్స్ క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. వేలసంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో పూజాహెగ్డే కరోనా బారినపడి కోలుకున్నట్లు తాజాగా వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా పూజాహెగ్డే తన ఆరోగ్యం పరిస్థితిని స్వయంగా ప్రకటించింది. 'నేను ఇంత త్వరగా కోలుకున్నాను అంటే కారణం.. అభిమానుల ప్రేమ.. ప్రార్థనలే. అందరికి కృతజ్ఞతలు. మీరిచ్చిన ఎనర్జీతోనే నేను కరోనా మహమ్మారిని తరిమి కొట్టాను. చివరిగా నెగటివ్ పొందాను. ఎప్పటికి మీ ప్రేమకు కట్టుబడి ఉంటాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజాహెగ్డే పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ గురించి ఎదురు చూస్తోంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా ప్రేరణ అనే పాత్రలో నటించింది. అలాగే ప్రస్తుతం రాంచరణ్ సరసన ఆచార్య సినిమాలో కనిపించనుంది. వీటితో పాటుగా దళపతి విజయ్ తో ఒకటి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా.. అలాగే రన్వీర్ సింగ్ తో కూడా ఓ సినిమా చేస్తోంది అమ్మడు. మొత్తానికి పూజా హవా మాములుగా ఉండేలా లేదు. చూడాలి మరి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పూజా క్రేజ్ అందుకుంటుందేమో..!