Begin typing your search above and press return to search.

మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..

By:  Tupaki Desk   |   26 March 2020 2:30 AM GMT
మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..
X
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతుంది పూజ హెగ్డే. వరుస హిట్లతో టాప్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజా కథనాల సమాచారం మేరకు.. ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటించడానికి పూజ భారీ పారితోషికాన్ని తీసుకుంటుందట. అదికూడా హీరో అఖిల్ కంటే హీరోయిన్ పూజకే ఎక్కువ చెల్లిస్తున్నారట నిర్మాతలు బన్నీవాసు, వాసు వర్మలు. ఇక హీరోకంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలోకి పూజ చేరిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని గుసగుసలాడుతున్నారు. మరి పూజ ఈ సోషల్ మీడియా వార్తలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.