Begin typing your search above and press return to search.

విభ‌గా మెరిపించిన‌ బుట్ట‌బొమ్మ నెక్ట్స్ ఏంటి?

By:  Tupaki Desk   |   16 Oct 2021 6:05 AM GMT
విభ‌గా మెరిపించిన‌ బుట్ట‌బొమ్మ నెక్ట్స్ ఏంటి?
X
ముంబై బ్యూటీ పూజాహెగ్డే రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. `అల‌వైకుంఠ‌పురములో` గ్రాండ్ స‌క్సెస్ అనంత‌రం త‌న రేంజు అమాంతం ప‌దింత‌లైది. పారితోషికంలోనూ ఇండ‌స్ట్రీ టాప్ వ‌న్ హీరోయిన్ గా మారిపోయింది. రెమ్యున‌రేష‌న్ ని ఒక్క‌సారిగా పెంచేసింది. న‌య‌న‌తార రేంజులో ఒక్కో సినిమాకు 3 కోట్లు ఛార్జ్ చేయ‌డం..సెట్స్ కు వెళ్లాలంటే చార్టెడ్ ప్లైట్ డిమాండ్ .. బాడీ గార్డులు వ‌గైరా వ‌గైరా అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా పూజా న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌రోసారి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న విభా అనే ఈవెంట్ ఆర్టిస్ట్ పాత్ర‌లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. మాంత్రికుడి లానే భాస్క‌ర్ కూడా పూజాకి అద్భుత‌మైన పాత్ర‌లో అవ‌కాశం క‌ల్పించార‌నే చెప్పాలి.

సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ పూజా పెర్పామెన్స్ ఓరియేంటెడ్ పాత్ర‌లో న‌టించ‌డం.. విభా పాత్ర హైలైట్ అవ్వ‌డం పూజా కెరీర్ కి క‌లిసొచ్చింది. ఆ సినిమా సంగ‌తి ప‌క్క‌న బెడితే పూజా భ‌విష్య‌త్ ని మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం పూజాహెగ్దే చేస్తోన్న సినిమాల లైన‌ప్ చూస్తే ఆ విష‌యం కొంచెం క్లారిటీ దొరుకుతుంది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధ‌కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `రాధేశ్యామ్ ` పాన్ ఇండియా కంటెట్ తో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు..హిందీ భాష‌ల్లో చిత్రం భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స‌హా పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ లోనే సినిమా విడుద‌ల కానుంది. సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి.

అలాగే కోలీవుడ్ లో విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్` లో న‌టిస్తోంది. ఈ చిత్రం వివిధ భాష‌ల్లో రిలీజ్ కానుంది. సౌత్ లో విజ‌య్ కు ఉన్న క్రేజ్ కార‌ణంగా ద‌క్షిణాది భాష‌ల్ని దున్నేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ తో క‌లిసి `సిర్క‌స్` లో న‌టిస్తోంది. ఇది పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. ఇలా ఈ మూడు చిత్రాలు ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్నాయి. ఒకేసారి రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. సినిమాలు హిట్టైతే గ‌నుక పూజా హెగ్దే క్రేజ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయం. ఇక మ‌హేష్- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ లోనూ బుట్ట‌బొమ్మే హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.