Begin typing your search above and press return to search.

చరణ్ సరసన జిగేల్ రాణి.. కెమిస్ట్రీ అదిరిపోనుందా..?

By:  Tupaki Desk   |   15 Feb 2021 2:00 PM IST
చరణ్ సరసన జిగేల్ రాణి.. కెమిస్ట్రీ అదిరిపోనుందా..?
X
మెగాస్టార్ చిరు 152వ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ మూవీకి చెందిన ఏదొక వార్త రోజు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. సోషల్ ఎలిమెంట్స్ తో మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమా ఇది. ఇదివరకు చిరు, కాజల్ కలిసి 'ఖైదీ నెం.150' మూవీలో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం విదితమే.

మల్టీస్టారర్ అనలేం గాని ఆచార్యలో ఓ చిన్నపాత్ర చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ జోడిగా హీరోయిన్ ఉంటుందని మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఇంతకాలం ఆ హీరోయిన్ని వెతికే పనిలో పడింది చిత్రబృందం. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఓకే చేసినట్లు సమాచారం. మొన్నటివరకు చరణ్ జోడిగా కియారా, రష్మిక లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ ఆఖరికి పూజా కన్ఫర్మ్ అయిందట. ప్రస్తుతం పూజ.. భారీ సినిమాలతో బిజీగా ఉంది. ఆచార్య సినిమాలో కొంత నిడివి గల పాత్ర చేస్తోంది. పూజ రాంచరణ్ సరసన సినిమా చేయడం ఇదే తొలిసారి. ఇదివరకు రాంచరణ్ రంగస్థలం సినిమాలో చరణ్ తో ఆడిపాడింది. ఈసారి హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి జిగేల్ రాణితో చరణ్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో!