Begin typing your search above and press return to search.

మెగా మల్టీస్టారర్ లో బుట్టబొమ్మ..?

By:  Tupaki Desk   |   25 Jan 2021 11:13 AM IST
మెగా మల్టీస్టారర్ లో బుట్టబొమ్మ..?
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ కిచ్లు నటిస్తుండగా.. చరణ్ కి జంటగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రంలో చరణ్ సరసన నటించనుందట. చరణ్ - పూజా కలిసి ఇంతకముందు 'రంగస్థలం' సినిమాలో జిగేల్ రాణి సింగ్ లో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.

కొరటాల శివ తనదైన శైలిలో సామాజిక అంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజాహెగ్డే కోసం మంచి రోల్ క్రియేట్ చేసాడట. పూజా ఇంతకముందు చేయని పాత్ర అని.. అది కూడా ఓ విలేజ్ గర్ల్ క్యారక్టర్ అని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ పూజా ఫిబ్రవరిలో 'ఆచార్య' సెట్స్ లో అడుగుపెడుతుందట. ఇకపోతే చరణ్ ఇందులో 'సిద్ధ' అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. కాగా, దేవాద‌య భూములు మరియు న‌క్స‌లిజం నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ నిర్మాణం చేపట్టారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.