Begin typing your search above and press return to search.

మహేష్ - త్రివిక్రమ్ సినిమాకి పూజా టెన్షన్!

By:  Tupaki Desk   |   27 Feb 2023 9:30 PM IST
మహేష్ - త్రివిక్రమ్ సినిమాకి పూజా టెన్షన్!
X
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టను ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు 28 పేరుతో సంభోదిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ మహేష్ బాబు తల్లిదండ్రులు ఇద్దరూ కన్ను మూయడంతో సినిమా షూటింగ్ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరిలోపు 60 నుంచి 70 శాతం షూటింగ్ పూర్తి చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయిన సరే.. ఫస్ట్ ఆఫ్ లోని మేజర్ సీన్స్ పూర్తయినట్లుగా చెబుతున్నారు. అయితే పూజా హెగ్డే కి గాయం కావడంతో ఆమె పాత్రకి సంబంధించిన షూటింగ్ పోర్షన్స్ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఆమె వల్ల షూటింగ్ కాస్త డిలే అయినట్లుగా చెబుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ఈ ఉదయాన్నే మరోసారి ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.

ఇక ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా యూనిట్ నుంచి ఒక అప్డేట్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజుకి టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ లాంటిది కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు ఆ సినిమా వర్క్ షాప్స్ కోసమే కేవలం రెండు నెలల పాటు మహేష్ బాబు డేట్స్ కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమా రూపొందించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.