Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ అందాల అల్ల‌రి

By:  Tupaki Desk   |   7 Oct 2021 5:18 AM GMT
బుట్ట‌బొమ్మ అందాల అల్ల‌రి
X
`అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్ కావ‌వ‌డం.. ఇందులో గురూజీ పూజాని బుట్ట‌బొమ్మ‌గా అభివ‌ర్నిస్తూ పాట రాయించ‌డంతో పూజా హెగ్డే టాలీవుడ్‌ కు బుట్ట‌బొమ్మగా మారిపోయింది. ఈ పాట‌ని ప్ర‌త్యేకంగా పూజా హేగ్డే కోస‌మే రాయించారా అన్న‌ట్టుగా చిత్రీక‌రించిన తీరు కూడా ఆడియ‌న్స్ ‌ని.. ఆమె అభిమానుల్ని అమితంగా ఆక‌ట్టుకుంది. దీంతో అక్క‌డి నుంచి పూజని బుట్ట‌బొమ్మ‌గా అభివ‌ర్ణంచ‌డం.. అదే పేరుతో పిల‌వ‌డం మొద‌లుపెట్టారు.

పూజా కూడా అందుకు త‌గ్గ‌ట్టే బుట్ట‌బొమ్మ‌లా క‌నిపిస్తూ అంద‌రిని ఎట్రాక్ట్ చేస్తోంది. కెరీర్ విష‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా దూసుకుపోతున్న పూజా హెగ్డే తెలుగు.. త‌మిళ‌.. హిందీ భాష‌ల్లో క్రేజీ ఆఫ‌ర్ల‌తో పాటు క్రేజీ రెమ్యున‌రేష‌న్‌ల‌ని ద‌క్కించుకుంటూ సౌత్‌ లోనే అత్యంత క్రేజ్‌ తో పాటు భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డుని సాధించింది. న‌య‌నతార అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా మొద‌టి స్థానంలో నిలిస్తే `బీస్ట్` చిత్రంతో ఆమెని వెన‌క్కి నెట్టి పూజా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

విజ‌య్ హీరోగా న‌టిస్తున్న త‌మిళ చిత్రం`బీస్ట్‌`లో పూజా హెగ్డే హీరోయిన్‌ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజా భారీ పారితోషికం తీసుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్‌`లోనూ పూజ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. రామ్‌ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న `ఆచార్య‌` చిత్రంలో పూజా .. రామ్‌చ‌ర‌ణ్ కు జోడీగా క‌నిపించ‌బోతోంది. ఈ రెండు చిత్రాలూ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే పూజా న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` విడుద‌ల‌కు రెడీ అయిపోయింది. ఈ నెల 14న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

వ‌రుస సిపిమాల‌తో బిజీగా వున్న పూజా స్టార్ హీరోయిన్ ‌గా స్టార్ ‌డ‌మ్‌ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పూజా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. వైట్ డ్రెస్‌ లో రెడ్ రోస్ పూజా ఫొటోల‌కు ఇచ్చిన పోజులు కుర్ర‌కారుకి కిర్రెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌ గా మారాయి. బుట్ట‌బొమ్మ అందాల అల్ల‌రికి నెటిజ‌న్స్ ఓ రేంజ్ ‌లో ఫిదా అయిపోతున్నారు.