Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే టేస్ట్ ఇంత చీప్ నా..?

By:  Tupaki Desk   |   25 Nov 2021 10:47 PM IST
పూజా హెగ్డే టేస్ట్ ఇంత చీప్ నా..?
X
సినీ ప్రముఖులు సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా కూడా సంపాదిస్తారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో.. ఇటీవల పలువురు హీరోయిన్లు హీరోలు ఆల్కాహాల్ బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. వీరిలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఉంది.

గతంలో పూజాహెగ్డే లిక్కర్ ని ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పలు పోస్టులు పెట్టింది. తన తండ్రి చేతిలో పెగ్ గ్లాస్ పట్టుకొని ఉంటే.. పక్కనే ఉండి స్టఫ్ రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు లేటెస్టుగా 'రెడ్ అండ్ జింజర్ ఛాలెంజ్' అంటూ బుట్టబొమ్మ మరోసారి పెగ్గు కలిపింది.. చిందులు కూడా వేసింది. జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా పూజా గ్లాస్ లో మందు - ఐస్ క్యూబ్స్ వేసి పెగ్ సెట్ చేసింది.

పూజా డ్యాన్స్ చేయడమే కాకుండా హుక్ స్టెప్పులతో ఓ వీడియోను షేర్ చేయమని ఓ చాలెంజ్ విసిరింది. ఇది కేవలం 25 ఏళ్లు నిండిన వారికే అని.. బాధ్యతాయుతంగా డ్రింక్ చేయాలని హ్యాష్ టాగ్ ని జత చేసింది. ఈ చాలెంజ్‌ లో పాల్గొంటే విన్నర్స్‌ కు మ్యూజిక్ కన్సర్ట్‌ లో పాల్గొనే అవకాశం ఉంటుందని.. త్వరలోనే విన్నర్స్ ని ప్రకటిస్తారని తెలిపింది. జానీ వాకర్ కోసం పూజా హెగ్డే వేసిన హుక్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే పూజా హెగ్డే ఇందులో జానీ వాకర్ లో చీప్ బ్రాండ్ అయిన రెడ్ లేబుల్ ను కలుపుతూ కనిపించడంతో.. బుట్టబొమ్మది ఇంత చీప్ టేస్టా అని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలానే సామాజిక బాధ్యత కలిగిన సెలబ్రిటీగా పుజా ఇలా మద్యాన్ని ప్రోత్సహించే ప్రకటనల్లో నటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యపానం హానికరం అని తెలిసి కూడా ప్రజల ఆరోగ్యాలను పాటు చేసుకోమనే విధంగా ప్రమోట్ చేయడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం మద్యాన్ని నిషేధించలేదు కదా.. పెయిడ్ ప్రమోషన్స్ చేస్తే తప్పేంటని మద్దతుగా నిలుస్తున్నారు.

కాగా, ఇటీవలే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పూజా హెగ్డే.. 'రాధే శ్యామ్' 'ఆచార్య' వంటి తెలుగు సినిమాలలో నటిస్తోంది. తమిళ్ లో 'బీస్ట్' - హిందీలో సల్మాన్ ఖాన్ - రణవీర్ సింగ్ - అమితాబ్ బచ్చన్ లతో సినిమాలు చేస్తోంది పూజాహెగ్డే.