Begin typing your search above and press return to search.

సెల్ఫీతో కిల్ చేస్తున్న‌ బ్యాచిల‌ర్ విభ‌

By:  Tupaki Desk   |   16 Oct 2021 2:09 PM GMT
సెల్ఫీతో కిల్ చేస్తున్న‌ బ్యాచిల‌ర్ విభ‌
X
అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో న‌టించింది పూజా హెగ్డే. ఈ సినిమా ఇటీవ‌లే రిలీజై క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ ఆక‌ట్టుకుంది. అలాగే ఇందులో అఖిల్.. పూజా జంట న‌ట‌న యూత్ కి క‌నెక్ట‌య్యింది. ఇక విభ పాత్ర‌లో పూజా హెగ్డే అంద‌చందాలు న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

క‌రోనా ట్రాజెడీ అనంత‌రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హాల్స్ లో విడుదల చేయడం పై పూజా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. చాలా కాలం తర్వాత థియేటర్ ల‌లోకి తిరిగి వచ్చినందుకు ప్రేక్షకులతో తన సినిమా మొదటి రోజు.. మొదటి షోని ఆస్వాధించినందుకు సంతోషంగా ఉంద‌ని పూజా వెల్ల‌డించింది. సినిమా హాల్ వెలుపల అభిమానులు చుట్టుముట్టిన ఫోటోని పూజా పంచుకున్నారు. ఆమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చూడటానికి ఆమె థియేటర్ ను సందర్శించ‌గా అభిమానులు గుమిగూడారు. ఈ చిత్రంలో పూజా స్టాండ్-అప్ కమెడియన్ పాత్రను పోషించ‌గా అఖిల్ పెళ్లికూతురుని వెతికే ఎన్నారై బ్యాచిల‌ర్ గా న‌టించాడు. ఈ మూవీని మొదట ఏప్రిల్ 2020 లో విడుదల చేయాలని నిర్ణయించినా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. ఎట్ట‌కేల‌కు రిలీజై యువ‌త‌రాన్ని మెప్పిస్తోంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా- ఆమని- మురళీ శర్మ - వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.

ఇక స‌క్సెస్ ఇచ్చిన కిక్కులో పూజా సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉంది. తాజాగా అదిరిపోయే సెల్ఫీని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. పూజా హెగ్డే త‌దుప‌రి ప్రభాస్ - రాధే శ్యామ్, రణ్‌వీర్ సింగ్ - సిర్కస్ .. చిరంజీవి -చ‌ర‌ణ్ ల‌ ఆచార్య చిత్రాల్లో న‌టించింది. ఇవ‌న్నీ రిలీజ్ ల‌కు రానున్నాయి.