Begin typing your search above and press return to search.

హీరో పిలిచాడ‌ట‌.. ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్న బుట్ట‌బొమ్మ‌..!

By:  Tupaki Desk   |   27 March 2021 3:00 PM IST
హీరో పిలిచాడ‌ట‌.. ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్న బుట్ట‌బొమ్మ‌..!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్‌ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది పూజా హెగ్డే. ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో.. ఈ అమ్మడి క్రేజ్ పీక్ స్టేజ్ కి చేరింది. రెబ‌ల్ స్టార్ ప్రభాస్ తో కలిసి నటిస్తున్న స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కావ్యం ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటు కోలీవుడ్ లోనూ స‌త్తా చాటుతోంది బుట్ట‌బొమ్మ‌. స్టార్ ఇళ‌‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ఈ మూవీలో.. పూజాహెగ్డేను ఫైన‌ల్ చేసిన‌ట్లు నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అఫీషియ‌ల్ గా ఈ మ‌ధ్య‌నే అనౌన్స్ చేసింది. ఈ ఛాన్స్ తో ఎంతో హ్యాపీగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది పూజా.

ఇప్పుడు త‌న నెక్స్ట్‌ బాలీవుడ్ మూవీ షూట్ కోసం ముంబై ఫ్లైట్ ఎక్క‌బోతోంద‌ట పూజా. స‌ల్మాన్ హీరోగా ఫ‌ర్హాద్ సంజీ డైరెక్ష‌న్లో తెర‌కెక్కుతున్న ‘క‌బీ ఈద్ క‌బీ దివాళి’ సెట్లో అడుగు పెట్టబోతోందట ఈ చిన్నది. ఈ మూవీలో సల్మాన్ బ్రదర్ ఇన్ లా ఆయుష్ శర్మతోపాటు జహీర్ ఇక్బాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

కాగా.. ఈ మూవీ షూట్ ను శ‌ర‌వేగంగా కంప్లీట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట స‌ల్లూ భాయ్‌. టైగ‌ర్‌-3 తోపాటు ‘క‌బీ ఈద్ క‌బీ దివాళి’ చిత్రాన్ని కూడా పార్ లాల్ గా షూట్ చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ రెండు సినిమాల‌ను ఏక‌కాలంలో ఫినిష్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సాజిద్ న‌డియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం.. త‌మిళ హిట్ మూవీ ‘వీరం’ రీమేక్ అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.