Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్‌' కోసం పూజా హెగ్డే మొదటి సారి..!

By:  Tupaki Desk   |   28 Sept 2020 9:30 AM IST
రాధేశ్యామ్‌ కోసం పూజా హెగ్డే మొదటి సారి..!
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ హ్యాపెనింగ్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు ముకుందా.. ఒక లైలా కోసం సినిమాల్లో నటించి కాస్త గ్యాప్‌ తీసుకుని డీజే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్లీ వెనక్కు చూసుకోలేదు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె అఖిల్‌ తో మోస్ట్‌ వాంటెడ్‌ బ్యాచిలర్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు ప్రభాస్‌ తో 'రాధేశ్యామ్‌' సినిమాలోనూ నటిస్తుంది. ఈ రెండు ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కోవిడ్‌ కారణంగా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ రెండు సినిమాలు పునః ప్రారంభం అయ్యాయి. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ షూటింగ్ లో పాల్గొంటున్న పూజా హెగ్డే వచ్చ నెలలో రాధేశ్యామ్‌ సినిమాలో నటించబోతుంది. రాధేశ్యామ్‌ సినిమాలో పూజా హెగ్డే కెరీర్‌ లో మొదటి సారి ద్విపాత్రాభినయం చేస్తోంది.

ప్రభాస్‌ సినిమా అంటే దేశ వ్యాప్తంగా చాలా ఆసక్తి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ప్రతిష్టాత్మక సినిమాలో కీలకమైన పాత్రలో పూజా కనిపించబోతుంది. అందుకు సంబంధించిన విషయం ఒకటి ప్రస్తుతం మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే కవల అమ్మాయిలుగా కనిపించబోతుందట. కథకు ఆమె చాలా కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇప్పటి వరకు పూజా హెగ్డే స్కిన్‌ షో కు మాత్రమే పరిమితం అయ్యింది. ఈ సినిమాతో మొదటి సారి ఆమెకు నటిగా తనను తాను నిరూపించుకునే సమయం వచ్చింది. 1980 ప్రేమ కథతో చాలా స్టైలిష్‌ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ లో వంశీ మరియు ప్రమోద్‌ లు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ చివరి వరకు సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.