Begin typing your search above and press return to search.

శ్యాం వ‌ర్సెస్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ప్రేయ‌సితో రొమాన్స్‌?

By:  Tupaki Desk   |   6 Nov 2020 10:45 AM IST
శ్యాం వ‌ర్సెస్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ప్రేయ‌సితో రొమాన్స్‌?
X
ఒకేసారి రెండు ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టిస్తోంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. ఓవైపు శ్యాంతో రొమాన్స్... మ‌రో వైపు ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ తో రొమాన్స్ .. ఈ రెండిటి కోసం పూజా దేశ విదేశాల్లో విహారం చేస్తోంది. ఇది ఎంతో క్లిష్ట‌ స‌న్నివేశ‌మే అయినా రెండిటినీ ఎంతో చాక‌చ‌క్యంగా మ్యానేజ్ చేసేస్తోంది.

రాధే శ్యామ్ నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకు ఎవ‌రిని ఎలా మ్యానేజ్ చేయాల‌న్న‌ది పూజా హెగ్డేకు బాగా తెలుసు. ఇటీవలే రాధే శ్యామ్ ఇటాలియన్ షెడ్యూల్ ను ముగించిన తరువాత హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇక్క‌డ‌ సుదీర్ఘ విరామం తీసుకోకుండా పూజా ఇప్పటికే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రీక‌ర‌ణ‌లో చేరింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` టీజర్ దసరా సందర్భంగా విడుదలైంది. దీనికి అభిమానుల నుండి విశేష‌ ఆదరణ లభించింది. అఖిల్- పూజా జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయి హాస్య ప్ర‌ధాన పాత్రను పూజా పోషిస్తోందిట‌. బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ -వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో విడుదల కానుంది.

మ‌రోవైపు రాధేశ్యామ్ మోష‌న్ టీజ‌ర్ రిలీజైతే దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. పూజా - ప్ర‌భాస్ జోడీ రొమాన్స్ ప్యూర్ లవ్ స్టోరీతో ఈ మూవీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఒకేసారి ఇద్ద‌రు హీరోల‌తో రొమాంటిక్ ల‌వ్ స్టోరీల్లో న‌టిస్తున్న బుట్ట‌బుమ్మ నిజంగా లక్కీగాళ్ అనే చెప్పాలి. అటు ఇటు షెడ్యూళ్ల‌ను తెలివిగా మ్యానేజ్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్ట‌కుంటోంది.