Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మకు కోపం తెప్పించిన 'కారు' గాసిప్!

By:  Tupaki Desk   |   17 April 2023 1:36 AM IST
బుట్టబొమ్మకు కోపం తెప్పించిన కారు గాసిప్!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం హిందే లో కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. సల్మాన్ ఖాన్ కి జోడీగా ఆమె నటించిన కిసికి జాన్ కిసికా భాయ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ లో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, అలాగే విలన్ జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై పూజా హెగ్డే చాలా హోప్స్ పెట్టుకుంది.

మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొంతకాలం నుంచి పూజా హెగ్డే చుట్టూ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే డేటింగ్ లో ఉందని జోరుగా ప్రచారం నడిచింది. పూజాహెగ్డే పెళ్లికి సల్మాన్ ఖాన్ తో కలిసి ఆమె హాజరు కావడంతో ఈ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

అయితే తాను ఎవరితో రిలేషన్ లో లేనని, ప్రస్తుతానికి తాను సింగిల్ అంటూ పూజా హెగ్డే ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే సర్కస్ మూవీ షూటింగ్ సమయంలో పూజా హెగ్డేకి నిర్మాత యష్ చోప్రా కారు బహుమతిగా ఇచ్చాడనే ప్రచారం కూడా బిటౌన్ లో జోరుగా వినిపిస్తోంది. వీటిపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది.

తమపై వచ్చే ప్రతి రూమర్ కి సమాచానం ఇచ్చుకోలేనని పూజా హెగ్డే మీడియాతో కాస్తా అసహనం వ్యక్తం చేస్తూనే చెప్పింది. అందరూ కారు నిర్మాత కారు ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు అని, అలా ఇచ్చి ఉన్నా బాగుండేది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే సల్మాన్ ఖాన్ కి జోడీగా భజరంగీ భాయ్ జాన్ సినిమాలో నటించబోతున్నట్లు వస్తోన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదని తేల్చేసింది.

ఇలా బాలీవుడ్ లో తనపై జరిగే అన్ని నెగిటివ్ ప్రచారాలకి పూజా హెగ్డే తనదైన శీలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. అయినా కూడా మళ్ళీ ఏదో ఒక కథని తీసుకొచ్చి రూమర్స్ క్రియేట్ చేయడం అనేది బాలీవుడ్ లో అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు పూజా హెగ్డే పాత రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నేపధ్యంలో ఇకపై ఎలాంటి గాసిప్స్ ఆమెపై వినిపిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.