Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: DJ బ్యూటీ దాచుకోలేకపోతోంది

By:  Tupaki Desk   |   9 Jan 2017 10:07 AM IST
ఫోటో స్టోరి: DJ బ్యూటీ దాచుకోలేకపోతోంది
X
సౌత్ లో గట్టి ప్రయత్నాలు చేసిన పూజా హెగ్డేకి.. హఠాత్తుగా బాలీవుడ్ ఛాన్స్ రావడం.. అది కూడా హృతిక్ రోషన్ సరసన కావడంతో ఎంచక్కా అక్కడ వాలిపోయింది. మొహెంజొదారోతో తన ఫేట్ మారిపోతుంది ఈ భామ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తే.. దాని రిజల్ట్ మళ్లీ ఈమెను నేల మీదకు తీసుకొచ్చేసింది. అంతకు ముందే ఇచ్చిన ఆఫర్ కావడంతో.. అల్లు అర్జున్ సరసన డీజే-దువ్వాడ జగన్నాధంలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే.

అలాగని బాలీవుడ్ పై మమకారం ఇంకా ఈ పాపకు చచ్చిపోలేదు. అక్కడి నుంచి మళ్లీ పిలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రీసెంట్ గా ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కోసం సెక్సీ పోజులు ఇచ్చేసింది. అమ్మడి డ్రస్ చూస్తే ఎథ్నిక్ వేర్ అని అర్ధమవుతుంది కానీ.. అసలు ట్యాలెంట్ అంతా.. కాళ్ల ప్రదర్శనలో చూపించంది. కంప్లీట్ గా ఫ్రంట్ కట్ ఉన్న రెడ్ కలర్ డిజైనర్ వేర్ లో.. అమ్మడు చూపిస్తున్న సోయగాలు మైమరిపించేస్తున్నాయి.

అందం విషయంలో.. దాన్ని ఎగ్జిబిట్ చేయడంలో అంతగా అబ్జెక్షన్స్ లేని ఈ భామకు. ట్రాక్ రికార్డ్ ఒక్కటే మైనస్ పాయింట్. స్టైలిష్ స్టార్ ఆ ఒక్క కొరత తీర్చాడంటే మాత్రం.. మళ్లీ పూజాకి డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకూ ఇలా ఏమీ దాచుకోకుండా ప్రదర్శించక తప్పదు మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/