Begin typing your search above and press return to search.
ఆమె వయ్యారాలలో అది కలిసిపోయింది
By: Tupaki Desk | 14 Dec 2017 10:57 PM ISTఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే ముకుందా సినిమాలో ఎంత సింపుల్ గా హోమ్లీగా కనిపించిందో అందరికి తెలిసిందే. కానీ అందాన్ని దాచేస్తే వర్కౌట్ కాలేదు అనుకొని అమ్మడు కొన్ని రోజులకే పద్ధతులన్నిటిని పక్కనపెట్టేసి గ్లామర్ షోకు ప్రాధాన్యం ఇచ్చింది. అయినా కూడా విజయాలు అందకపోవడంతో డోస్ కొంచెం ఎక్కువగా పెంచేసి బికినీకు సై అనడంతో అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
డీజే సినిమాలో బికినీలో రచ్చ చేసి అందరిని బాగానే ఆకర్షించింది. అన్ని క్యారెక్టర్స్ చేయగలను అనే రేంజ్ లో చెప్పకనే చెప్పిన ఈ భామ మంచి ఆఫర్స్ ని అందుకునే దిశగా సాగుతోంది. అయితే రీసెంట్గా ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ ఎవరు ఊహించని లుక్ లో దర్శనం ఇచ్చింది. ప్రముఖ ఎల్లే ,మ్యాగజిన్ కోసం సరికొత్త డ్రెస్ లో కనిపించింది. అసలే అమ్మడి ఒంపు సొంపుల వయ్యారాలు ఓ రేంజ్ లో ఉంటాయి దానికి తోడు ఆ డ్రెస్ కూడా చాలా మలుపులు తిరిగి ఉంది.
