Begin typing your search above and press return to search.
వేకువఝామున నిదుర లేవగానే షాక్ తిన్న పూజా
By: Tupaki Desk | 22 Nov 2021 11:00 PM ISTసోషల్ మీడియాల్లో బుట్టబొమ్మ హవా సాగుతోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో పూజా మైండ్ బ్లాక్ చేస్తోంది. ఇటీవల మాల్దీవుల విహారం నుంచి అగ్గి రాజేసే ఫోటోల బంచ్ తో విరుచుకుపడింది. ఆ ఫోటోలపై ఇప్పటివరకూ డిబేట్ రన్ అయ్యింది. ఇప్పుడు మరో ఆసక్తికర వీడియోని షేర్ చేయగా వైరల్ అవుతోంది. వేకువఝామున నిదుర లేవగానే పూజా తన ఫోన్ లోకి తొంగి చూసింది. ఇంకేం ఉంది .. సడెన్ షాక్.. అంతగా ఆ షాక్ ఎందుకు? అంటే తనకు ఇన్ స్టాలో 1.6 కోట్ల మంది (16మిలియన్లు) అనుచరులు లాకయ్యారు. అందుకే ఆ ఆనందంలో పూజా జోష్ ఫుల్ గా కనిపించింది. నిజానికి ఇటీవల మాల్దీవుల విహారం తనకు ఇన్ స్టా అనుచరుల్ని పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతోంది!
గత ఏడాది ఆరంభం అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో విజయం అందుకుని తదుపరి రాధేశ్యామ్ సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది ఈ బ్యూటీ. ప్రభాస్- పూజాహెగ్డేల రొమాంటిక్ మూవీ రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కథాంశాన్ని లిరిసిస్ట్ కృష్ణకాంత్ లీక్ చేశారు. గీత రచయిత కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని మొత్తం 5 పాటలను తానే రాశానని కథలోని రహస్యాన్ని కూడా తాను ఛేధించానని పేర్కొన్నాడు. ప్రభాస్ తొలిసారి పూజా హెగ్డేతో రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రం మొదటి సింగిల్ గత వారం ప్రారంభమైంది. ఇది తక్షణ హిట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ పాటకు గీత రచయిత కృష్ణకాంత్ ఇటీవల స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను వెల్లడించారు. రాధే శ్యామ్ 1970ల యూరప్ నేపథ్యంలో సాగుతుందని అయితే దాని గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ చిత్రం తెరపై పునర్జన్మ లేదా టైమ్ ట్రావెల్ ను చిత్రీకరిస్తుందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు రాధే శ్యామ్ రైలు ప్రయాణంలో జరిగే రహస్యం గురించి ఊహించారు. ఏది ఏమైనా ఈ సస్పెన్స్ ను అలాగే ఉంచాలి అని గీత రచయిత అన్నారు. అనంతరం తాను రాసిన ఈ రాత్లే గురించి మాట్లాడుతూ.. ఈ పాట కొందరికి క్లిష్టంగా అనిపించవచ్చని అయితే పెద్ద తెరపై చూసినప్పుడు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారని కాంత్ అన్నారు. ఈ రాత్లే ద్వారా సినిమా మొత్తం కథను చెప్పే ప్రయత్నం చేశాం. చాలా గందరగోళ సన్నివేశాలకు బదులుగా మాంటేజెస్ ని ఉపయోగించారు.
రాధే శ్యామ్ అనేది భారతీయ కాలపు సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ డ్రామా.. దీనిని రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 14 జనవరి 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. UV క్రియేషన్స్- గోపీ కృష్ణ మూవీస్- T-సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం తెలుగు హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు.